Begin typing your search above and press return to search.

నేనూ మోసపోయా.. రియల్ మోసాలపై పెదవి విప్పిన జగపతిబాబు

హీరో నుంచి విలన్ గా మారి.. క్యారెక్టర్ ఆర్టిస్టులో అనేక సక్సెస్ లను సొంతం చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న నటుడిగా జగపతిబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   29 May 2024 5:21 AM GMT
నేనూ మోసపోయా.. రియల్ మోసాలపై పెదవి విప్పిన జగపతిబాబు
X

హీరో నుంచి విలన్ గా మారి.. క్యారెక్టర్ ఆర్టిస్టులో అనేక సక్సెస్ లను సొంతం చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న నటుడిగా జగపతిబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వయసు మీద పడిన తర్వాత ఆయనకొచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా.. నిర్మోహమాటంగా.. ఉన్నది ఉన్నట్లుగా.. ముఖం మీదనే చెప్పేసే అలవాటున్న అతి కొద్ది అగ్రనటుల్లో ఆయన ఒకరు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు.

అందులో ఆయన సంచలన అంశాల్ని ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ మోసాల మీద ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం చెప్పారన్నారు. ఇటీవల తాను ఒక రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఒక యాడ్ లో నటించానని.. తనను కూడా మోసం చేసినట్లుగా చెప్పారు.

తనను మోసం చేసిన వారెవరు? తాను ఎలా మోసపోయానన్న విషయాన్ని తాను త్వరలోనే చెబుతానని చెప్పిన జగపతిబాబు.. భూమిని కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ.. రెరా నిబంధనల్ని తెలుసుకోవాలన్న సూచన చేశారు. అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జగపతిబాబు లాంటి వాళ్లు మోసపోవటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఆయన్ను మోసం చేసిన వారెవరు? దానికి సంబంధించిన వివరాల అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. మరి..దీనిపై తర్వాతి వీడియో ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.