Begin typing your search above and press return to search.

'సినిమా హిట్టు - రైతు ఫట్టు'... చిరంజీవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఖైదీ నెంబర్ 150 సినిమా పేరు చెప్పి ఆయన చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   19 July 2024 1:26 PM GMT
సినిమా హిట్టు - రైతు ఫట్టు... చిరంజీవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు!
X

తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తాజాగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా బీఆరెస్స్, బీజేపీ లతో పాటు మెగాస్టార్ చిరంజీవిని జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. ఖైదీ నెంబర్ 150 సినిమా పేరు చెప్పి ఆయన చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ రుణమాఫీని ఆగస్టు 15లోపు పూర్తిచేస్తామని చెప్పిన తెలంగాణ సర్కార్.. గురువారం ప్రారంభించింది. ఈ విషయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో... మెగాస్టార్ చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తెలంగాణలో రుణమాఫీ పైసలతో రైతన్నల ఫోన్లు అన్నీ టింగు టింగుమంటున్నాయని మొదలుపెట్టిన జగ్గారెడ్డి.. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అయిపోతుందని అన్నారు. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతుల ఇళ్లల్లో సంబరాలు జరుగుతుంటే.. బీజేపీ, బీఆరెస్స్ నేతలకు మాత్రం రాత్రి నిద్రలేదని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తాడు తప్ప, పనికి పనికిరాడని విమర్శించిన జగ్గారెడ్డి.. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీ నెరవేర్చాం అని అన్నారు. ఇదే సమయంలో... నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటోళ్ల కు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసిందే కానీ... ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు.

ఇక దేశ రాజధాని ప్రాంతంలో రైతులు ఎండనక, వాననక, చలి అనక, మంచు అనక నిరసన తెలుపుతుంటే... కేంద్రంలోని మంత్రుల కుమారులు కార్లతో వారిని గుద్దారని ఫైరయ్యారు! ఈ సమయంలోనే చిరంజీవి ప్రస్థావన తెచ్చిన జగ్గారెడ్డి... చిరంజీవి తీసిన సినిమాలో రైతులు నష్టంతో ఆత్మహత్య చేసుకున్నట్లు.. ఆ రైతుల కోసం చిరంజీవి కష్టపడ్డట్లు తీశారని.. ఆ సినిమా హిట్టయ్యిందని అన్నారు.

ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల కోట్లాది రూపాయలు చిరంజీవికి వచ్చాయి.. ఆ డైరెక్టర్ కి వచ్చాయి.. బాధ ఏంటంటే.. నడి రోడ్డుమీద రైతులు నెలలు నెలలు బీజేపీ నల్లచట్టాల మీద ధర్నాలు చేస్తుంటే... సినిమాలో నిరసన చేసినట్లుగా.. రైతులకు మద్దతు ఎందుకు తెలపలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా... సినిమా హిట్టు, రైతులు ఫట్టు అని సెటైర్ వేశారు!

ఇదే సమయంలో రైతులకు అన్యాయం చేసిన బీజేపీ సపోర్ట్ చేస్తున్న మీ తమ్ముడుకి మీరెండుకు సపోర్ట్ చేశారని చిరంజీవిని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఈ విషయంపై ఆంధ్ర తెలంగాణ రైతులు ప్రజలు ఆలోచించాలని... ఆ సినిమాలకు కోట్లు వచ్చేలా చేసేది మనమే కాబట్టి అని అన్నారు. ఇది వాస్తవం అని.. ఇది నిజం అని అన్నారు.