Begin typing your search above and press return to search.

చిరంజీవిపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో కౌంటర్లు!

ఈ నేపథ్యంలో... జగ్గారెడ్డికి నెటిజన్లు సమాధానం చెబుతున్నారు.. స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత డబ్బులు సుమారు 30 కోట్లను కౌలు రైతులకు పంచినట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   21 July 2024 9:55 AM GMT
చిరంజీవిపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు.. సోషల్  మీడియాలో కౌంటర్లు!
X

ప్రముఖ రాజకీయ నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పైనా ఘాటుగా రియాక్ట్ అయ్యారు! ప్రధానంగా రైతు సమస్యలపై స్పందిస్తూ.. చిరు, పవన్ లను కార్నర్ చేస్తూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో... ఈ వ్యాఖ్యలకు నెట్టింట రియాక్షన్ కూడా అంతకు మించి ఘాటుగా వస్తున్నాయి.

అవును... "సినిమా హిట్టు.. రైతులు ఫట్టు" అంటూ మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' ని ప్రస్థావిస్తూ... కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చిరంజీవి రైతుల కోసం ఫైట్ చేశారు.. సినిమా హిట్టు.. ఆయనకు కోట్ల రూపాయలు వచ్చాయి.. కానీ.. రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తే మాత్రం చిరంజీవీ మౌనంగా ఉన్నారని అన్నారు.

ఢిల్లీలో బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు చేస్తే... దానికి వ్యతిరేకంగా ఎండనక, వాననక, చలి అనక, మంచు అనక రైతులు నిరసన తెలిపితే... రైతుల పేరుపై సినిమా చేసి కోట్లు సంపాదించుకున్న చిరంజీవి స్పందించలేదని అన్నారు. పైగా.. ఆ చట్టాలు చేసిన బీజేపీతో వాళ్ల తమ్ముడు పవన్ కలిస్తే... వారికి మద్దతు పలికారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో... జగ్గారెడ్డికి నెటిజన్లు సమాధానం చెబుతున్నారు.. స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత డబ్బులు సుమారు 30 కోట్లను కౌలు రైతులకు పంచినట్లు తెలిపారు. అసలు జగ్గారెడ్డి రైతుల కోసం ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కోవిడ్ - 19 మహమ్మారి సమయంలో చిరంజీవి ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడానికి తన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని అన్నారు.

ఇదే సమయంలో సంగారెడ్డిలో రోడ్ల దుస్థితిని చూపించే వీడియోలను కొందరు వినియోగదారులు పోస్ట్ చేశారు. జగ్గరెడ్డి.. ముందు ఈ సంగారెడ్డి ప్రాంతం గురించి ఆలోచించాలని సూచించారు. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉంది, ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గారెడ్డి.. ఈ మౌలిక సదుపాయాల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.