మైండ్ బ్లాక్ చేసిన కపూర్ సిస్టర్స్
క్రీమ్ నెమలి పర్పుల్ బ్లౌజ్‌తో ఫిల్మీ సిల్క్ చీర ధరించిన ఖుషీ నవ్వులు విరజిమ్ముతూ ఎంతో అందంగా కనిపించింది.
By: Tupaki Desk | 5 March 2024 3:51 AM GMTగుజరాత్- జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఖుషీ కపూర్ - జాన్వీ కపూర్ ఎథ్నిక్ వేర్‌లో హాజరై మతులు చెడగొట్టారు. క్రీమ్ నెమలి పర్పుల్ బ్లౌజ్‌తో ఫిల్మీ సిల్క్ చీర ధరించిన ఖుషీ నవ్వులు విరజిమ్ముతూ ఎంతో అందంగా కనిపించింది. అక్కా చెల్లెళ్లు హస్తక్షర్ వేడుకకు హాజరయారు. ఈ వేడుక ఆద్యంతం కళ్లన్నీ కపూర్ సిస్టర్స్ పైనే. అంతందంగా సాంప్రదాయబద్ధంగా కనిపించారు సిస్టర్స్.
దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సహా బాలీవుడ్ ప్రముఖులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల చివరి రోజున ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ తమ సొగసైన ఎత్నిక్ వేర్‌లో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.
జాన్వీ ఒక పింక్ సిల్క్ చీరలో ఎంతో ముగ్ధమనోహరంగా కనిపించింది. గోల్డెన్ ప్రింట్ బార్డర్ అదనపు ఆకర్షణ కాగా.. అత్యద్భుతమైన భారీతనం నిండిన నగలు, నడుము వడ్డానంతో ఇద్దరూ అదరగొడుతున్నారు. సోదరీమణులు కలిసి మనోహరంగా, నిష్కపటంగా పోజులివ్వడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. గత రాత్రి, జాన్వీ - ఖుషీలు తమ బాయ్‌ఫ్రెండ్స్ శిఖర్ పహారియా - వేదంగ్ రైనాతో కలిసి ప్రీవెడ్డింగ్ పార్టీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. తాజా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల్లో వేదాంగ్, ``పట్టు గర్ల్స్`` అంటూ అందమైన కామెంట్ చేసాడు.
జాన్వీ -ఖుషీతో పాటు, బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిజైనర్ దుస్తుల్లో `హస్తక్షర్` వేడుకలో అందంగా కనిపించారు.