Begin typing your search above and press return to search.

జై హనుమాన్.. ఏంటిది నిజమేనా?

సీక్వెల్ కు బడ్జెట్ భారీగా పెరిగిందని, అందుకే జై హనుమాన్ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకుంటున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:48 AM GMT
జై హనుమాన్.. ఏంటిది నిజమేనా?
X

హనుమాన్.. యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఆ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2024 సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి.. పెద్ద పెద్ద రికార్డులను బద్దలు కొట్టింది. మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. అన్ని వర్గాల సినీ ప్రియులను అలరించింది. అయితే హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ను మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు.

దీంతో సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ స్పెషల్ గ్లింప్స్ కూడా షేర్ చేశారు. చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో నది.. ఎంతో ఆహ్లాదమైన వాతావరణాన్ని చూపిస్తూ వెల్ కమ్ టు అంజనాద్రి 2.0 అంటూ పోస్ట్ చేశారు. జై హనుమాన్ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లోని రఘునందన సాంగ్ అటాచ్ మెంట్ తో వచ్చిన వీడియో నెట్టింట కొన్ని రోజుల పాటు తెగ చక్కర్లు కొట్టింది.

అయితే శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్‌ మూవీ రూపొందనుంది. జనవరిలో ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేయగా.. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. 2025 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకొస్తారని ఆ మధ్య వార్తలు జోరుగా వినిపించగా.. ఇప్పుడు 2026లో జై హనుమాన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.

ఇక హనుమాన్ మూవీతో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత నిరంజన్ రెడ్డి ఎలాంటి లాభాలు అందుకున్నారో తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాతో భారీ ప్రాఫిట్స్ ను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు సీక్వెల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. సీక్వెల్ కు బడ్జెట్ భారీగా పెరిగిందని, అందుకే జై హనుమాన్ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకుంటున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.

ఆయన బదులు టాలీవుడ్ ప్రముఖ సంస్థ.. మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది రూమరే అయ్యి ఉంటుందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఏంటిది నిజమేనా అని మరికొందరు అడుగుతున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఆ ప్రాజెక్టు విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.