Begin typing your search above and press return to search.

ఒక్క‌ డైలాగ్‌తో ముప్పు..ఏకంగా జాతీయ అవార్డు మిస్!?

అయితే ఈ సినిమాలో ఆ ఒక్క సీన్ వ‌ల్ల‌నే జాతీయ అవార్డు రాకుండా పోయిందని నెటిజనులు విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 5:15 PM GMT
ఒక్క‌ డైలాగ్‌తో ముప్పు..ఏకంగా జాతీయ అవార్డు మిస్!?
X

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను జూరీ ఘ‌నంగా ప్ర‌క‌టించింది. ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా హ‌వా కొన‌సాగింది. అదే స‌మ‌యంలో త‌మిళ సినిమా పూర్తిగా నీర‌స‌ప‌డింది. మాధ‌వ‌న్ రాకెట్రి ఉత్త‌మ చిత్రంగా అవార్డు గెలుచుకోవ‌డం పెద్ద ఊర‌ట అనుకుంటే.. త‌మిళ ఇండ‌స్ట్రీలో అంత‌గా ఆశించిన‌ మెరుపులేవీ లేవు. ఇక టాలీవుడ్ ఏకంగా 10 జాతీయ‌ అవార్డులను గెలుచుకుని సంబ‌రాల్లో మునిగి తేలింది. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన సర్పత్తా- జై భీమ్ స‌హా ప‌లు త‌మిళ‌ చిత్రాలకు జాతీయ అవార్డుల్లో గుర్తింపు ద‌క్క‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది.

ముఖ్యంగా సూర్య న‌టించిన జైభీమ్ చిత్రానికి జాతీయ అవార్డ్ వ‌స్తుంద‌ని అంతా భావించారు. కానీ ఆ సినిమా పుర‌స్కారానికి దూర‌మైంది. జైభీమ్ లో సంక్లిష్టమైన సామాజిక సమస్యను ప్రస్తావిస్తూ గంభీరమైన కథనం ఉన్నప్పటికీ జాతీయ అవార్డును ఎందుకు కోల్పోయింద‌నే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాలో ఆ ఒక్క సీన్ వ‌ల్ల‌నే జాతీయ అవార్డు రాకుండా పోయిందని నెటిజనులు విశ్లేషిస్తున్నారు. హిందీలో మాట్లాడినందుకు ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి తమిళంలో మాట్లాడమని అడిగే సన్నివేశం ఉంటుంది. ఈ వివాదాస్పద సన్నివేశం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని జాతీయ జ్యూరీని కూడా చికాకు పెట్టే అవకాశం ఉందని, అందుకే వారు ఈ సినిమాను అవార్డుల నుంచి తప్పించారని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే మ‌రో కోణంలో విశ్లేషిస్తే 'పుష్ప‌' చిత్రంలో అల్లు అర్జున్ మ్యాసివ్ పెర్ఫామెన్సెస్ ముందు జాతీయ అవార్డుల జూరీకి ఇంకేదీ క‌నిపించ‌క‌పోయి ఉండొచ్చు. ఆర్.ఆర్.ఆర్ లో అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో మెరిపించిన మేటి క‌థానాయ‌కులు రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల‌కు సైతం ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం వ‌స్తుంద‌ని ఆశించినా రాలేదు.

మ‌రి జై భీమ్ న‌టుడు సూర్య కూడా రేసులో ఉన్నా పుర‌స్కారం ద‌క్క‌లేదు. అవార్డు ఎవ‌రో ఒక‌రికే ద‌క్కుతుంది. అది అల్లు అర్జున్ ని మాత్ర‌మే వ‌రించింది. దీనికి ఇత‌ర హీరోలంతా బ‌న్నీకి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం స‌ముచితం.