Begin typing your search above and press return to search.

మొదటి సీజన్‌కి రూ.40 లక్షలు రెండో సీజన్‌కి రూ.20 కోట్లు

2020లో పాతాళ లోక్‌ అనే వెబ్‌ సిరీస్‌ వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఆ వెబ్‌ సిరీస్‌కి మంచి స్పందన దక్కింది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 5:01 AM GMT
మొదటి సీజన్‌కి రూ.40 లక్షలు రెండో సీజన్‌కి రూ.20 కోట్లు
X

సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే పారితోషికం ఏ స్థాయిలో పెరుగుతుందో మనం చూస్తూనే ఉంటాం. హీరో లేదా హీరోయిన్‌ బ్యాక్ టుబ్యాక్‌ విజయాలను అందుకుంటే కోట్ల పారితోషికాలు అందుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఒక హీరోయిన్‌కి మొదటి సినిమాకు గాను పాతిక లక్షల లోపు పారితోషికం అందుకుంటే... ఆ సినిమా హిట్ అయ్యి పేరు దక్కితే రెండో సినిమాకు రెండు కోట్లు, ఆ సినిమా కూడా సక్సెస్‌ అయితే మూడో సినిమాకు అంతకు మించి పారితోషికంగా అందుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే సినిమా ఇండస్ట్రీలో పారితోషికం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వారి క్రేజ్‌ను బట్టి ఉంటుంది.

2020లో పాతాళ లోక్‌ అనే వెబ్‌ సిరీస్‌ వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఆ వెబ్‌ సిరీస్‌కి మంచి స్పందన దక్కింది. ఆ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన జైదీప్ అహలావత్‌ కి మంచి గుర్తింపు దక్కింది. హతీరాం చౌదరి పాత్రలో కనిపించిన జైదీప్‌ అహలావత్‌ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. అందుకే ఆ వెబ్‌ సిరీస్‌ తర్వాత ఆయనకు మంచి స్టార్‌డం దక్కింది. ఆ వెబ్‌ సిరీస్‌తో సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చాయి. దాంతో పాతాళ లోక్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2ను రూపొందించడం జరిగింది. త్వరలో స్ట్రీమింగ్‌ కాబోతున్న సీజన్ 2 పైనా అంచనాలు అందరిలోనూ భారీగా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కాబోతున్న పాతాళ లోక్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్ 2 ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను మేకర్స్ వెల్లడించారు. ఆ సమయంలోనే సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించబోతున్న జైదీప్ అహలావత్‌ పారితోషికం గురించి ఆసక్తికర విషయం వెళ్లడి అయ్యింది. ఆయన పారితోషికం బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోలను మించి ఉండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాబోయ్‌ అంత పారితోషికం ఏంటి అంటూ అంతా షాక్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం జైదీప్ పారితోషికం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది అంటే ఆయన ఏ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

పాతాళ లోక్‌ వెబ్‌ సిరీస్‌ మొదటి సీజన్‌ కి గాను జైదీప్ అహలావత్‌ కేవలం రూ.40 లక్షల పారితోషికం అందుకున్నారు. సీజన్‌ 2 లో నటించడం కోసం ఆయన ఏకంగా రూ.20 కోట్లను పారితోషికంగా అందుకున్నాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వెబ్‌ సిరీస్‌ బడ్జెట్‌లో మెజార్టీ భాగంగా ఆయన పారితోషికం నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో ఒక వెబ్‌ సిరీస్‌కి ఈ స్థాయిలో పారితోషికం అందుకున్న నటుడు ఈయనే అంటూ ప్రచారం జరుగుతోంది. ముందు ముందు జైదీప్‌ సినిమాల్లోనూ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సీజన్ 2 హిట్ అయితే జైదీప్ స్టార్‌డం, పారితోషికం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.