Begin typing your search above and press return to search.

జై హనుమాన్.. హాలీవుడ్ కనెక్షన్!

హనుమాన్ మూవీతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవల్ లో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   22 July 2024 6:57 AM GMT
జై హనుమాన్.. హాలీవుడ్ కనెక్షన్!
X

హనుమాన్ మూవీతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవల్ లో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సూపర్ హీరో మూవీగా హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి 300+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కంటెంట్ లో దమ్ముంటే హీరో చిన్న, పెద్ద అనేది ఆడియన్స్ పట్టించుకోరని హనుమాన్ మూవీ ప్రూవ్ చేసింది. ఈ సినిమాతో హీరో తేజ సజ్జా కూడా ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు.

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా తర్వాత రణవీర్ సింగ్ తో సూపర్ హీరో మూవీ చేయాలని ప్రశాంత్ వర్మ భావించాడు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ సినిమా రద్దయ్యింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు రణవీర్ సింగ్ తో పాటు ప్రశాంత్ వర్మ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారు. దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఏకంగా 200+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారంట. అలాగే స్టార్ హీరోని మూవీలో టైటిల్ రోల్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఒకే అయితే మూవీ షూటింగ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోంది. అలాగే మరో ప్రొడక్షన్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతోందంట. హాలీవుడ్ లెవల్ కి జై హనుమాన్ సినిమాని తీసుకొని వెళ్లాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారు.

అందుకే ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో డైరెక్ట్ గా సంప్రదింపులు జరుపుతున్నారంట. ఇండియన్ సినిమా మార్కెట్ స్టాండర్డ్స్ పెరగడంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా మన కంటెంట్ పై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం నిర్మాణ భాగస్వామిగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు తెలియదు.

ఒక వేళ నిజంగానే హాలీవుడ్ నిర్మాణ సంస్థ జై హనుమాన్ మూవీ ప్రొడక్షన్ లో భాగం అయితే సినిమాకి ఇంటర్నేషనల్ లెవల్ రీచ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని తర్వాతనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ సూపర్ హీరో కథలని కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నారంట.