జై హనుమాన్ అనుకున్న దానికన్నా భారీగా..!
హనుమాన్ సినిమా సక్సెస్ ఇండస్ట్రీ అంతా క్రేజీ టాపిక్ గా మారింది. సంక్రాంతి సీజన్ లో రిలీజైన ఏ సినిమా కూడా సాధించని రేర్ ఫీట్ హనుమాన్ సాధించింది.
By: Tupaki Desk | 13 Feb 2024 5:30 AM GMTహనుమాన్ సినిమా సక్సెస్ ఇండస్ట్రీ అంతా క్రేజీ టాపిక్ గా మారింది. సంక్రాంతి సీజన్ లో రిలీజైన ఏ సినిమా కూడా సాధించని రేర్ ఫీట్ హనుమాన్ సాధించింది. 300 కోట్ల కలెక్షన్స్ తో హనుమాన్ ఎవర్ గ్రీన్ హిట్ అనిపించుకున్నాడు. ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని నిలబెడుతూ హనుమాన్ ఈ రేంజ్ సక్సెస్ అవ్వడం అతని ప్రతిభని మెచ్చుకునేలా చేస్తుంది. ఇదే కాదు మొదటి సినిమా అ! నుంచి ప్రశాంత్ వర్మ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు.
హనుమాన్ గ్రాండ్ సక్సెస్ తో ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఉంటుందని చెప్పొచ్చు. జై హనుమాన్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ అధీర, మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ పూర్తి చేసి జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించాలి.
అసలైతే జై హనుమాన్ ను 2025 రిలీజ్ అని ప్లాన్ చేసినా సినిమా రిలీజ్ కన్నా అనుకున్న విధంగా తీయడం ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు చిత్ర యూనిట్. అంతేకాదు హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో జై హనుమాన్ ని కావాల్సినంత బడ్జెట్ లో తీసే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైం లో ఈ టైం కే రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోకుండా సినిమా పూర్తి చేస్తే బెటర్.
ప్రశాంత్ వర్మ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు కానీ 2025 రిలీజ్ అనేలా కాకుండా సినిమా అనుకున్న విధంగా హనుమాన్ మెచ్చిన ప్రేక్షకులందరినీ జై హనుమాన్ కూడా సూపర్ అనిపించేలా చేయాల్సిందే. అందుకు ప్రశాంత్ వర్మ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిందే. జై హనుమాన్ సినిమా కోసం ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. మరి హనుమాన్ తోనే బీభత్సం సృష్టించిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో ఇంకెంతటి ప్రభంజనాలు సృష్టిస్తాడన్నది చూడాలి.
జై హనుమాన్ లో స్టార్స్ కూడా ఉంటారని హింట్ తెలిసిందే. సో హనుమాన్ కి పర్ఫెక్ట్ సీక్వెల్ గా మరింత భారీగా జై హనుమాన్ ఉండబోతుంది. ఆడియన్స్ కూడా సీక్వెల్ గురించి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. హనుమాన్ లా స్టార్స్ మధ్య కాకుండా జై హనుమాన్ ని రిలీజ్ విషయంలో కూడా మంచి డేట్ చూసి వదిలేలా చూస్తున్నారు. ఈసారి జై హనుమాన్ పాన్ ఇండియా లెవెల్ లో 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.