'జైలర్ -2' ముహూర్తం పెట్టేసారా!
రజనీకాంత్ కూడా రెండవ భాగానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో మరో హీరో ఆలోచన లేకుండా నెల్సన్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే పనిలో ఉన్నారు.
By: Tupaki Desk | 23 Dec 2024 6:08 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో 'జైలర్ -2'కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలి సిందే. 'జైలర్' హిట్ అయిన అనంతరం నెల్సన్ పార్ట్ -2 పనుల్లోనే నిమగ్నమై పనిచేస్తున్నారు. రజనీకాంత్ కూడా రెండవ భాగానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో మరో హీరో ఆలోచన లేకుండా నెల్సన్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది. మిగతా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
రజనీ డేట్లు ఇస్తే పట్టాలెక్కించాలని నెల్సన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమాకి ముహూర్తం పెట్టినట్లు తెలు స్తోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇందులో రజనీకాంత్ పాత్రను మరింత స్టైలిష్ గా చూపించ బోతున్నారుట. రజనీ గెటప్ ..కాస్ట్యూమ్స్ ప్రతీది ప్రెష్ ఫీల్ తీసుకొస్తుందంటున్నారు.
అలాగే ప్రతి నాయకుడు పాత్ర పోషించిన వినాయకన్ పాత్రను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతున్నారుట. రజనీ పాత్రకి ఏమాత్ర తగ్గకుండా తగ్గాఫ్ వార్ లా ఆ పాత్ర తెరపైకి కనిపిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. తొలి భాగాన్ని మించి అతడి పాత్రలో కామెడీ మరింత బలంగా ఉంటుందిట. ఏకంగా విదేశాల నుంచి విగ్రహాల్లో స్మగ్లింగ్ దందాని నెక్స్ట్ లెవల్లో చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక సినిమాలో స్టార్ హీరోలు కూడా భాగమవు తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. పాత పాత్రలను యధావిధిగా కొనసాగిస్తూనే అదనంగా పాన్ ఇండియాకి మరింత కనెక్ట్ అయ్యేలా? బలమైన స్టార్లను తీసుకుంటున్నారుట. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ రేసులో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.