జైలర్ కలెక్షన్స్.. విక్రమ్ లెక్క బ్రేక్ అయ్యింది
ఇక మంగళవారం రోజు ఆగస్టు 15 హాలిడే కావడంతో ఆ రోజును ఈ సినిమా మరింత ఉపయోగించుకుంది.
By: Tupaki Desk | 16 Aug 2023 8:01 AM GMTసౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ చాలాకాలం తర్వాత సరైన సక్సెస్ అందుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా బీభత్సమైన కలెక్షన్స్ అయితే అందుకుంటోంది.
మొదటి రోజే ఊహించని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక తర్వాత కొంత తగ్గినప్పటికీ కూడా మినిమం కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక మంగళవారం రోజు ఆగస్టు 15 హాలిడే కావడంతో ఆ రోజును ఈ సినిమా మరింత ఉపయోగించుకుంది. పోటీగా లోకల్ మెగాస్టార్ సినిమా ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
6వ రోజు ఏపీ తెలంగాణలో ఈ సినిమా మొత్తంగా ఆరు కోట్ల రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. హాలిడేస్ ఏ మాత్రం దొరికినా కూడా జైలర్ అసలు గ్యాప్ ఇవ్వకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంటోంది. దానికి తోడు పోటీగా వచ్చిన భోళా శంకర్ కు డిజాస్టర్ టాక్ రావడంతో మరింత ప్లస్ అయింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియోన్స్ కు జైలర్ సినిమా బెస్ట్ ఛాయిస్ గా మారుతొంది.
అలాగే ఈ వారం కూడా పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు ఏమీ రావడం లేదు. 'ప్రేమ్ కుమార్', 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిపై కూడా పెద్దగా బజ్ లేదు. కాబట్టి ఈ వీకెండ్ మొత్తం కూడా జైలర్ మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మొత్తం 6 రోజుల్లో అయితే 28.60 కోట్ల షేర్ కలెక్షన్స్, 49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఓవరాల్ గా తెలుగులో అయితే జైలర్ సినిమా 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా ఇప్పుడు ఆ టార్గెట్ ను పూర్తిచేసుకుని ఏకంగా 15 కోట్ల రేంజ్ లో అయితే ప్రాఫిట్ అందించింది. ఈ లాభాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికే 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
అంటే విక్రమ్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసేసింది. కమల్ హాసన్ విక్రమ్ సినిమా టోటల్ గా 410 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో 416 కోట్లను అందుకొని జైలర్ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తానికి తలైవా హిట్ టాక్ అందుకుంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఈ సినిమా నిరూపించింది.