80 కోట్లు ఫస్ట్ డే టార్గెట్… సాధ్యమేనా?
ఈ నేపథ్యంలో కచ్చితంగా సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో కలిపి 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 10 Aug 2023 4:03 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ రిలీజ్ కాబావుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి అందిస్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాఫియా బ్యాక్ డ్రాప్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ యాక్షన్ కథాంశం ఉందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చింది. ఇలాంటి కథలు ప్రస్తుతం కోలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జైలర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి రోబో తర్వాత వచ్చిన ఏ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. అయితే ఆయన ఛరిష్మాయ మాత్రం సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ అందిస్తుంది.
ఫ్లాప్ అయినా కూడా ఓపెనింగ్స్ డే కలెక్షన్స్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు రజిని స్టామినాని పరిచయం చేస్తున్నాయి.
రోబో 2. ఓ మూవీ మొదటి రోజు 95 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ లో ఉంది. దాని తర్వాత కబాలి 87.5 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు అందుకుంది. దీని తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ సినిమా 52 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించింది. తరువాత శివ దర్శకత్వంలో గత ఏడాది రిలీజ్ అయినా అన్నాత్తై మూవీ 50.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది.కాలా సినిమా 41.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది.
కార్తీక్ సుబ్బరాజు దర్శాకత్వంలో తెరకెక్కిన పెట్టా 38 కోట్లతో అతి తక్కవ ఫస్ట్ డే గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా ఉంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో కచ్చితంగా సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో కలిపి 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొంత మంది అయితే రోబో 2.ఓ రికార్డ్ ని కచ్చితంగా బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ పరంగా చూసుకుంటే హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఉంటుంది. ఈ కారణంగానే అతని సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. మరి జైలర్ సినిమా గురువారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది చూడాలి.