రజనీకి BMW నెల్సన్-అనిరుధ్‌లకు పోర్చే కార్లు
ఆ కోణంలో చూస్తే ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కి 100 కోట్ల పారితోషికంతో పాటు ఖరీదైన BMW X7 కార్ ని నిర్మాత కానుకగా ఇచ్చారు
By: Tupaki Desk | 5 Sep 2023 4:36 AM GMTబాలీవుడ్ లో గదర్ 2, కోలీవుడ్ లో జైలర్ భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలు 500 కోట్ల క్లబ్ వసూళ్లను అధిగమించి భారతీయ సినిమా హిస్టరీలో సంచలనాలుగా మారాయి. పఠాన్ తర్వాత గదర్ 2, జైలర్ విజయాలు దేశీ సినీపరిశ్రమల్లో గొప్ప ఉత్సాహం పెంచాయి. ఆసక్తికరంగా తమ సినిమాలు బంపర్ హిట్లు కొట్టేందుకు కృషి చేసిన వారికి అరుదైన కానుకలిచ్చి సంతుష్ఠులను చేసే సంస్కృతి సౌతిండియన్ సినీపరిశ్రమల్లో ఇప్పటికే ఉంది.
ఆ కోణంలో చూస్తే ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కి 100 కోట్ల పారితోషికంతో పాటు ఖరీదైన BMW X7 కార్ ని నిర్మాత కానుకగా ఇచ్చారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు కోట్లాది రూపాయల పారితోషికంతో పాటు పోర్చే కారును కూడా నిర్మాత కళానిధి మారన్ అందించాడు. ఇంకా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రశంసల చిహ్నంగా లగ్జరీ కారును అందుకున్నాడు. కళానిధి మారన్ తన కార్యాలయ ప్రాంగణానికి మూడు విభిన్న లగ్జరీ కార్లను తీసుకువచ్చాడు. వాటిలో అనిరుధ్‌ను తనకు ఇష్టమైన కార్ ని ఎంచుకోవడానికి అనుమతించాడు.
అన్ని ఎంపికలను టెస్ట్ డ్రైవింగ్ చేసిన తర్వాత అనిరుధ్ రవిచందర్ పోర్చే కార్ ను ఎంచుకున్నారు. నిజానికి జైలర్ చిత్రం అద్భుతమైన విజయంలో అతని సంగీతం కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నేపథ్య సంగీతం- బీజీఎం పాటలు ప్రతిదీ ప్రధాన అస్సెట్ గా నిలిచాయి. అందుకే ఇప్పుడు అనిరుధ్ తన ప్రతిభకు తగ్గ గుర్తింపు గౌరవం అందుకున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
25 రోజులకు 'గదర్2' 500కోట్లు, జైలర్ 600కోట్లు
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'గదర్ 2' 25 రోజుల్లో 500కోట్లు వసూలు చేయగా, రజనీకాంత్ నటించిన జైలర్ ఏకంగా 600కోట్లు వసూలు చేసింది. సెప్టెంబర్ 7న 'జవాన్' విడుదలయ్యే వరకు ఇరు సినిమాలు విజయవంతమైన రన్ ని కొనసాగించే వీలుందని అంతా భావిస్తున్నారు.
నాల్గవ ఆదివారం అంటే సెప్టెంబర్ 4న జైలర్ భారతదేశంలో రూ.3 కోట్ల నికర వసూళ్లను సాధించింది, ఇది నాల్గవ వారంలో ఒక చిత్రానికి గణనీయమైన ప్రదర్శన అని ట్రేడ్ చెబుతోంది. సెప్టెంబర్ 3తో జైలర్ థియేటర్లలో 25వ రోజు సెలబ్రేషన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శనను ప్రదర్శిస్తోంది. 25 రోజుల వ్యవధిలో భారతదేశంలో జైలర్ సినిమా మొత్తం వసూళ్లు రూ.335.87 కోట్లకు చేరాయి. అదే సమయంలో ఈ చిత్రం నాల్గవ వారంలో ప్రపంచవ్యాప్త వసూళ్లలో రూ.600 కోట్ల మైలురాయిని అధిగమించింది.
నిజానికి జైలర్ విడుదలైన అనంతరం వెంటనై పైరసీ వీడియో వెబ్ లో సర్క్యులేట్ అయింది. ఈ దురదృష్టకర లీక్‌కు ప్రతిస్పందనగా నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ముందస్తు OTT విడుదలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జైలర్ ప్రీమియర్ థియేట్రికల్ విడుదల తర్వాత ఒక నెల కంటే తక్కువ సమయంలో జరుగుతుంది. సెప్టెంబర్ 7న ఓటీటీలో విడుదలవుతోంది. జైలర్ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్. యాక్షన్-ప్యాక్డ్ చిత్రం. నెల్సన్ దిలీప్‌కుమార్ దీనికి రచయిత. ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటించారు. వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి కూడా కీలక పాత్రలలో ఉన్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రఖ్యాత నటుల అతిధి పాత్రలు గొప్పగా అలరంచాయి.