Begin typing your search above and press return to search.

జైలర్.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఆగష్టు 10న పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రెమ్యునరేషన్ క్రిందనే 150 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   5 Aug 2023 11:36 AM GMT
జైలర్.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా జైలర్. ఆగష్టు 10న పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అన్నాత్తై తర్వాత సూపర్ స్టార్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో జైలర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రతి ఏడాది కచ్చితంగా తన నుంచి ఒక మూవీ వచ్చేలా రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే ఈ ఏడాది జైలర్ చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మూవీ పై అంచనాలు పెంచేసింది. రజినీకాంత్ కి జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. వారి కూతురుగా మిర్నా మీనన్ నటిస్తోంది. తమన్నా మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు స్టార్ యాక్టర్ సునీల్, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, మలయాళీ నటుడు వినాయకన్, యోగిబాబు లాంటి నటులు మూవీలో ఉన్నారు.

ఈ సినిమా బడ్జెట్ 225 కోట్లు అయినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఏ చిత్రాన్ని నిర్మించారు. ఇక మూవీలో రెమ్యునరేషన్ గానే భారీగా ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రజినీకాంత్ 70 నుంచి 80 కోట్ల మధ్య తీసుకొని ఉంటాడని తెలుస్తోంది. అయితే 110 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. శివరాజ్ కుమార్ కి 4 కోట్లు ఇచ్చారు.

తమన్నా 3 కోట్ల వరకు ఛార్జ్ చేసింది. రమ్యకృష్ణ కోటి రూపాయిలు తీసుకుందంట. ప్రతినాయకుడిగా చేసిన జాకీ ష్రాఫ్ 75 లక్షలు తీసుకున్నారు. సునీల్ కి 60 లక్షల వరకు ఇచ్చారు. వసంత్ రవి, వినాయకన్ కి 35 లక్షల వరకు రెమ్యునరేషన్ గా ఇచ్చారు. ఇలా రెమ్యునరేషన్ క్రిందనే 150 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

అయితే రజినీకాంత్ కి రోబో తర్వాత బ్లాక్ బస్టర్ అనదగ్గ చిత్రం ఇప్పటి వరకు పడలేదు. కాలా, రోబో 2.ఓ, పెట్టా, దర్బార్, అన్నాత్తై సినిమాలు చేశారు. ఒక్క రోబో 2.ఓ మాత్రమే పర్వాలేదనిపించుకుంది. మిగిలిన సినిమాలు అన్ని ఏవరేజ్, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అయిన కూడా జైలర్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కి అందిస్తుందనేది చూడాలి.