కల్కిలో జక్కన్న పాత్ర.. అలా ఉంటుందా?
ఇండియన్ మైథలాజికల్ క్యారెక్టర్స్ ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 19 Oct 2023 4:18 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథలాజికల్ క్యారెక్టర్స్ ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం కంప్లీట్ గా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కంప్లీట్ గా మోషన్ క్యాప్చర్ లో ఇమాజినరీ వరల్డ్ లో ఈ కథ నడవబోతోంది.
అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ మూవీలో శ్రీమహావిష్ణువు చివరి అవతారం అయిన కల్కిగా కనిపించబోతున్నాడు. అమితాబచ్చన్ లార్డ్ పరశురామ్ పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా మొదటి సారి ఈ సినిమాలో నటిస్తూ ఉండటం విశేషం. గతంలో ప్రతినాయకుడి పాత్రలు కమల్ చేసిన అవి అతని సొంతం చిత్రాలతోనే ఉంటాయి.
అయితే మొదటిసారి వేరొక హీరో చిత్రంలో విలన్ గా కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజమౌళి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారంట. ప్రభాస్ తో ఉన్న బాండింగ్, వైజయంతీ మూవీస్ వారితో ఉన్న అనుబంధం కారణంగా ఒక ఇంటరెస్టింగ్ రోల్ ని రాజమౌళికి ఆఫర్ చేసారంట. రాజమౌళి కూడా ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
మూవీలో అతను సైంటిస్ట్ పాత్రలో కనిపించాబోతున్నారనే ప్రచారం విస్తృతంగా నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. నిజంగా రాజమౌళి ఈ చిత్రంలో భాగం అయితే కొంత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. మేకింగ్ పరంగా కూడా రాజమౌళి సలహాలు, సూచనలు నాగ్ అశ్విన్ తీసుకుంటున్నారు అని టాక్.
అయితే ఇందులో వాస్తవం లేదనే ప్రచారం కూడా మరో వైపు జరుగుతోంది. మొదటి నుంచి కల్కి సినిమాపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. వాటిలో చాలా వరకు వాస్తవం కాదు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిర్మిస్తోంది. ఈ మూవీతో ఇండియన్ సినిమా హాలీవుడ్ లోకి కూడా వెళ్ళబోతూ ఉండటం విశేషం.