యానిమల్.. ఆ సాంగ్స్ సౌండ్స్ గట్టిగానే..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్
By: Tupaki Desk | 3 Dec 2023 6:10 AM GMTసందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ చిత్రం కలెక్ట్ చేసింది. అలాగే అతని నుంచి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చూస్తున్నారు.
సింపుల్ స్టొరీ లైన్ ని ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో సందీప్ రెడ్డి వంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి తనని ఎందుకు యూత్ ఎక్కువగా ఇష్టపడతారో మరోసారి ప్రూవ్ చేశాడు. ఈ సినిమాకి యూత్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం మరీ యాక్షన్ సన్నివేశాలు శృతమించి ఉన్నాయనే కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేక్షకాదరణ మాత్రంఅద్భుతంగా వస్తోంది. ముఖ్యంగా సినిమాలోని కొన్నిసన్నివేశాలకి, అలాగే విలన్ గా బాబీడియోల్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాలో ఓ బిట్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాబీ డియోల్ మూడో పెళ్లి చేసుకునే సమయంలో చిన్న పిల్లల వాయిస్ తో వచ్చే బిట్ సాంగ్ తెగ పాపులర్ అయిపొయింది.
ఈ సాంగ్ ఉపయోగించుకొని విభిన్నమైన సిచువేషన్స్ లో మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అరబిక్ సాంగ్ నుంచి ఓ బిట్ ని తీసుకొని సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాలో విలన్ సిచువేషన్ కి సరిపోతుందని ఉపయోగించారు. నిజంగా సినిమాలో అది అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అదే సాంగ్ ని మీమర్స్ కూడా ఉపయోగించేస్తున్నారు.
యానిమల్ లో ఈ సాంగ్ లాగే కొన్ని డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మీమర్స్ కి యానిమల్ సినిమా ద్వారా కొత్త సరుకు దొరికిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ మీమ్స్ కూడా యానిమల్ సినిమాకి ఎక్స్ట్రా హైప్ తీసుకొని వస్తున్నాయి. లాంగ్ రన్ లో కలెక్షన్స్ మీద ఇవి ఎంత వరకు ఉపయోగపడతాయో అనేది చూడాలి.