చివరి సినిమా సునామీ బిజినెస్!
ఇప్పటి వరకూ వినోద్ రాజకీయ నేపథ్యం గల సినిమాలు చేయలేదు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు మాత్రమే చేసారు.
By: Tupaki Desk | 31 Jan 2025 3:15 AM GMTదళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' గా ఖరారైన సంగతి తెలిసిందే. విజయ్ ఎన్నికల బరిలోకి ముందు ఎలాంటి సినిమా చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అందుకు తగ్గట్టే విజయ్ ప్లాన్ చేసుకుని సీన్ లోకి దిగారు. హెచ్. వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటి వరకూ వినోద్ రాజకీయ నేపథ్యం గల సినిమాలు చేయలేదు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు మాత్రమే చేసారు. తొలిసారి పోలిటికల్ స్టోరీతో తమిళ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
విజయ్ కు వైట్ అండ్ వైట్ కొత్తేం కాదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కమర్శియల్ టచ్ ఇస్తూ కొన్ని సినిమాలు చేసారు. కానీ పరి పూర్ణ రాజకీయ నాయకుడిగా ఏ సినిమా చేయలేదు. తాజాగా పరిస్థితులు డిమాండ్ చేయడం చేయడంతో రాజకీయ నాయకుడిగా మారాల్సి వస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాపై పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోందని సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ 75 కోట్లకు అమ్మడు అయినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
సినిమా మొత్తంగా 400 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. విజయ్ గత సినిమా 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' తెలుగులో ఫెయిలైనా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు రిలీజ్ అయిన 'లియో' టాలీవుడ్ లో యావరేజ్ గా ఆడిన పుల్ రన్ లో ఆ సినిమా 600 కోట్లుకు పైగా రాబట్టింది.
అంతకు ముందు రిలీజ్ అయిన బీస్ట్, బిగిల్, మాస్టర్ , సర్కార్, మెర్సల్ అన్ని బ్లాక్ బస్టర్లే. 'వారిసు' కూడా 300 కోట్లకు పైగా రాబట్టింది. ఈ గణాంకాలు సహా..విజయ్ చివరి చిత్రమనే బజ్ నేపథ్యంలోనే 'జయ నాయగన్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశన్నంటుతుంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.