Begin typing your search above and press return to search.

జనక అయితే గనక టీజర్.. సుహాస్ మరో కొత్త ప్రయోగం

ఒక్కో అవకాశం తెచ్చుకుంటూ మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు.

By:  Tupaki Desk   |   4 July 2024 12:17 PM GMT
జనక అయితే గనక టీజర్.. సుహాస్ మరో కొత్త ప్రయోగం
X

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఇంటరెస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సుహాస్ ని చూస్తే అర్ధమవుతోంది. యుట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సుహాస్ తరువాత సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. ఒక్కో అవకాశం తెచ్చుకుంటూ మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు.

కలర్ ఫోటో సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. తరువాత రైటర్ పద్మభూషణ్ మూవీతో మరో హిట్ కొట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. చిన్న సినిమాలు అయిన సుహాస్ టాలెంట్, నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. నాని తర్వాత నేచురల్ యాక్టర్ ఇమేజ్ తో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దూసుకుపోతున్నాడు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో బలగం తర్వాత రెండో సినిమా సుహాస్ హీరోగా తెరకెక్కింది. సందీప్ బండ్ల దర్శకత్వంలో ఈ మూవీ రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. టీజర్ ని ప్రభాస్ లాంచ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం ప్రభాస్ అద్భుతంగా ఉందని మేకర్స్ కు బెస్ట్ విషెస్ అందించారు. జనక అంటే గనక అనే టైటిల్ తో మూవీ రెడీ అవుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ లో సుహాస్ చేసిన క్యారెక్టర్ ప్రైవేట్ ఉద్యోగం చేసే ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది.

ఈ కాలంలో పిల్లలు కనడం, వారిని చదివిందడం ఎంత భారం అవుతుందో అతని క్యారెక్టర్ ద్వారా రిప్రజెంట్ చేశారు. ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్ ని మార్చేసింది అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ చేశారు. అలాగే ప్రైవేట్ ఉద్యోగిగా అతను పడే కష్టాలని, చాలీచాలని జీతంతో లీడ్ చేసే మధ్యతరగతి జీవితాన్ని రిప్రజెంట్ చేశారు. నేను ఒక వేళ తండ్రినైతే నా పెళ్ళాన్ని సిటీలో బెస్ట్ హాస్పిటల్ లో చూపించాలి. బెస్ట్ స్కూల్ లో పిల్లలని చదివించాలి. బెస్ట్ కాలేజీలో చదివించాలి.

వారికి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. ఇవన్నీ చేయలేనప్పుడు పిల్లల్ని కనకూడదు అంటూ సుహాస్ చెప్పే డైలాగ్ తో అతని క్యారెక్టరైజేషన్ ని టీజర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. మధ్యతరగతి జీవితం కారణంగా పిల్లల్ని కనడానికి ఇష్టపడని యువకుడిగా సుహాస్ కనిపిస్తున్నాడు. ఈ టీజర్ చూస్తుంటే చాలా మంది రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కూడా కంటెంట్ సిచువేషన్ కి తగ్గట్లుగా ఉంది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

బలగం తో సూపర్ హిట్ కొట్టి మరోసారి అదే తరహాలో రియాలిటీకి దగ్గరగా ఉండే కథతోనే రెండో సినిమాని కూడా దిల్ రాజు కొడుకు, కూతురు తీస్తూ ఉండటం విశేషం.. మూవీ అయితే ప్రేక్షకులని కంటెంట్ ఎట్రాక్ట్ చేస్తోంది. రిలీజ్ అయితే బలగం లాంటి మరో సక్సెస్ దిల్ రాజు ప్రొడక్షన్ ఖాతాలో చేరుతుందని అనిపిస్తుంది. డైరెక్టర్ సందీప్ బండ్ల కూడా ఇంటరెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని టీజర్ తో స్పష్టం అవుతోంది. సందీప్ రెడ్డి బండ్ల సలార్ మూవీకి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. దీంతో ప్రభాస్ అతన్ని ప్రోత్సహించేందుకు మూవీ టీజర్ ని లాంచ్ చేసిఅంట్లు తెలుస్తోంది.