Begin typing your search above and press return to search.

విజయ్ విడాకులా?.. ఆ నటి ఏమందంటే..

నటి జనని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన మహిళలకు ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తాడు

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:30 PM GMT
విజయ్ విడాకులా?.. ఆ నటి ఏమందంటే..
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. బయట అతను ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా అలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా కూడా ఏదో ఒక గాసిప్ తో విజయ్ పేరు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తే ట్రెండింగ్ లిస్టులో అతని పేరు ఉంటుంది.

విజయ్ తన ప్రతి సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. రీసెంట్గా లియో సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబట్టుకున్నా డు. ఇక ఈ హీరో పర్సనల్ లైఫ్ విషయాలు బయట వాళ్లకు తెలియనిది ఏమీ కాదు. అయితే విజయ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడు అని ఒక ప్రముఖ హీరోయిన తో ప్రేమలో పడ్డ విజయ్ తన భార్య దూరంగా ఉంటున్నాడు అనేలా చాలా రకాల గ్రాఫిక్స్ అయితే వచ్చాయి.

ఇక ఈ విషయంపై విజయ్ అలాగే అతని కుటుంబ సభ్యులు గానీ ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. అయితే రీసెంట్ గా లియోలో నటించిన జనని విజయ్ గురించి మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే వచ్చిన గాసిప్స్ లో ఎలాంటి ఇజం లేదు అని తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ తన భార్యను ఎంతగానో ప్రేమిస్తాడట.

నటి జనని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన మహిళలకు ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తాడు. నన్ను ఒక చెల్లెలుగా భావించారు. నేను మాట్లాడుతూ ఉంటే తన భార్య కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి ఆమె గురించి ఎంతో ప్రేమగా మాట్లాడారు. నేను శ్రీలంకలో పుట్టాను. అక్కడ తమిళ భాష వేరుగా ఉంటుంది.

అలాగే విజయ్ భార్య కూడా అక్కడి వారే. కాబట్టి ఆ లాంగ్వేజ్ సింక్ కావడం తో విజయ్ ఆ విషయం గురించి మాట్లాడారు అని జనని తెలియజేశారు. దీన్నిబట్టి విజయ్ భార్య విషయంలో ఎంత ప్రేమగా సరదాగా ఉంటారో అర్థం అవుతుంది అని ఫ్యాన్స్ నెగిటివ్ వార్తలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత లండన్ చదువుకుంది. అయితే 1996లో విజయ్ మీద అభిమానంతో ఆమె అక్కడి నుంచి ఇండియాకు వచ్చి ప్రత్యేకంగా కలిసింది. అంత దూరం నుంచి వచ్చిన ఆ అభిమానికి విజయ్ ఫిదా అయిపోయాడు. ఇక తర్వాత కొన్ని రోజుల ప్రయాణంతోనే వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఇక వీరికి జెసన్ సంజయ్ కుమార్తె శాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.