Begin typing your search above and press return to search.

బన్నీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తా: జనసేన MLA

అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వారికి గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 11:50 AM GMT
బన్నీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తా: జనసేన MLA
X

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని నచ్చని వారు ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా నచ్చితేనే వస్తానంటూ బన్నీ వ్యాఖ్యానించడంతో మరింతగా మండిపడుతున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వారికి గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. అలా నెట్టింట ఎటు చూసినా మెగా, బన్నీ ఫ్యాన్స్ ట్వీట్లే కనిపిస్తున్నాయి.

అదే సమయంలో రీసెంట్ గా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదని, ఆయన తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో అని వ్యాఖ్యానించారు. తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారని ఆరోపించారు. దీంతో బొలిశెట్టి వ్యాఖ్యలు వైరల్ గా మారగా.. బన్నీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మరోసారి బొలిశెట్టి మీడియాతో మాట్లాడారు.

బన్నీపై వ్యాఖ్యల విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. తాను దేని గురించి కూడా మాట్లాడదలచుకోలేదని చెప్పారు. "ఆ విషయంపై అడిగారు నిన్న.. అందుకే సమాధానమిచ్చాను. అతనికి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మా పార్టీకి అతనికి ఎలాంటి శత్రుత్వం లేదు. వాళ్లు ఏదైనా మాట్లాడితే మనం మాట్లాడాలి. అంతేగాని ఒత్తిగా మాట్లాడకూడదు. అతను మొన్న మాట్లాడారు అందుకే కౌంటర్ ఇచ్చాను. మళ్లీ వాళ్లు మాట్లాడితే నన్ను అడగండి.. అప్పుడు కౌంటర్ ఇస్తాను" అని చెప్పారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ గా మారగా.. మాట్లాడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే నిన్న మీడియాతో మాట్లాడిన తర్వాత.. ఓ ట్వీట్ చేసి డిలీట్ చేశారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. "నాకు ఇష్టమైతేనే వస్తా.. ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని గానీ.. నాగబాబు గారిని గానీ.. పవన్ కళ్యాణ్ గారినీ కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా!" అని ఎక్స్ లో ట్వీట్ చేశారు బొలిశెట్టి శ్రీనివాస్.

"మరీ ముఖ్యంగా నేను చెప్పదలచుకున్నది ఏమనగా.. నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించాను.. దాన్ని గమనించగలరు" అని బొలిశెట్టి తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ట్వీట్ ను డిలీట్ చేసేశారు. మీడియాతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు మరోసారి వ్యాఖ్యలు చేసిన వీడియోను అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శతృత్వం లేదని చెబుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.