జనసేనలో 'కమిటీ కుర్రాళ్లు' ఏం చేస్తున్నారు...?
మెగా ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అంటే ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది.
By: Tupaki Desk | 7 Aug 2024 10:57 AM GMTమెగా ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అంటే ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది. మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలకే కాకుండా మెగా డాటర్ నిహారిక నిర్మించిన సినిమాకు కూడా హడావిడి వాతావరణం కనిపిస్తుంది. చిన్న సినిమానే అయినా కూడా కమిటీ కుర్రాళ్లు సినిమా ను నిహారిక నిర్మించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా ఫ్యామిలీతో పాటు ఎంతో మంది ఈ సినిమా ప్రమోషన్ కోసం అన్నట్లుగా తమ వంతు సాయం ను అందించడం జరిగింది. అందుకే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా ద్వారా దాదాపు 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు యదు వంశీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి సంబంధించిన టచ్చింగ్స్ ఉంటాయని ఇండైరెక్ట్ గా చెప్పాడు. సినిమాలో రాజకీయాలను చూపించబోతున్నట్లుగా స్వయంగా ఆయన ప్రకటించాడు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.... నాకు ఎప్పటి నుంచో జయ ప్రకాష్ నారాయణ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. వారి రాజకీయం, వారి వ్యక్తిగత ప్రవర్తన అన్ని కూడా నాకు చాలా ఇష్టం. అందుకే వారు చేసిన రాజకీయాలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమాలో కొన్ని సీన్స్ రాసుకున్నాను. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో రాజకీయాలకు సంబంధించినవి ఉంటాయి. ఆ సమయంలో ప్రస్తుత రాజకీయాలను మిలితం చేసి సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందని అన్నాడు.
చివరి 20 నిమిషాల సన్నివేశాలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలను ఉదాహరణగా తీసుకుని రాసుకున్నాను. అలా అని ఇది పూర్తి స్థాయి పొలిటికల్ సినిమా కాదు, ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ సినిమా కనుక జనసేన పార్టీ గురించి డైరెక్ట్ గా కాకున్నా కనీసం ఇండైరెక్ట్ గా అయినా ఉంటుంది. మరి ఆ జనసేన పార్టీని ఈ సినిమాలో ఎలా చూపించారు, ఇంతకు జనసేన పార్టీలో కమిటీ కుర్రాళ్లు ఏం చేస్తారు అనేది సినిమా విడుదల అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రాజకీయాలు చూపించాలి అంటే ఒకింత భయపడే పరిస్థితి ఉంది. అందుకు కారణం ఎక్కడ రాజకీయాలు అంట కట్టి ఒక్క పార్టీ వారు మరో పార్టీ వారు అంటూ విమర్శలు చేసి సినిమాను బహిస్కరిస్తారో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అయినా కూడా ఈ సినిమాలో రాజకీయాలను చూపించడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రిఫరెన్స్ సీన్స్ ఉండబోతున్నాయి. అంటూ బహిరంగంగానే చెప్పడంతో అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తోంది.