జాన్వీ కపూర్ గత ఏడాదిలా మమా అనిపిస్తే సరిపోదు!
జాన్వీ కపూర్ కెరీర్ లో సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతుంది. ఇంకా చెప్పాలంటే డెబ్యూ ధడక్ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన ఫలితాలు అందించలేదు.
By: Tupaki Desk | 12 Feb 2025 10:30 PM GMTజాన్వీ కపూర్ కెరీర్ లో సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతుంది. ఇంకా చెప్పాలంటే డెబ్యూ ధడక్ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన ఫలితాలు అందించలేదు. టాలీవుడ్ లో లాంచ్ అవ్వనంత కాలం అమ్మడి ఎంట్రీపై విపరీ తమైన బజ్ క్రియేట్ అయింది. కానీ `దేవర` తో లాంచ్ అయిన తర్వాత అందులో అమ్మడి పాత్రకు ప్రశంసలకు బధులు విమర్శలు ఎదుర్కుంది. దేవర కు డివైడ్ టాక్ రాగా, అందులో జాన్వీ పాత్ర విమర్శలకు గురైంది.
జాన్వీ ఆరేళ్ల కెరీర్ లో ఏడెనిమిది సినిమాలే చేసింది. వాటిలో చెప్పుకోదగ్గవి ధడక్ .. ఆ తర్వాత దేవర మాత్రమే. `దేవర`తోపాటు గత ఏడాది `మిస్టర్ అండ్ మిస్టర్స్ మహి`, `ఉలజ్` చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు కూడా ఆశించిన ఫలితాలివ్వలేదు. అంతకు ముందు ఏడాది...ఇంకా ముందుకెళ్లినా? జాన్వీ ఖాతాలో విజయాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో ఇప్పటికిప్పుడో సక్సెస్ అనివార్యమైంది.
గతం తరహాలో ఇప్పుడు థియేటర్లోకి వచ్చి మమా అనిపిస్తే సరిపోదు. బ్లాక్ బస్టర్ పడాల్సిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్ నటిస్తోన్న హిందీలో రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. `సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ`, `పరమ్ సుందరి` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో ఆర్సీ 16లోనూ నటిస్తోంది. ఈ మూడు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందు కొస్తున్నాయి. వాటిపై అంచనాల సంగతి పక్కన బెడితే జాన్వీ మాత్రం హిట్ కొట్టాల్సిందేనని టాక్ బలంగా మొదలైంది. ఈ సినిమాలు కూడా అటు ఇటూ అయితే? జాన్వీ సక్సెస్ రేస్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిందేనని మాట అంతే బలంగా వినిపిస్తుంది.
పటౌడీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ ఇప్పటికే అదే ఫేజ్లో కొనసాగుతుంది. ఆరంభంలో దక్కిన గౌరవం..గుర్తింపు ఇప్పుడు దక్కడం లేదు. కారణం వరుస వైఫల్యాలు ఎదురవ్వడం అన్నది వర్దమాన భామలంతా గుర్తించాలి. మరి ఈ విషయాల్ని జాన్వీ ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.