తారక్ విషయంలో జాన్వీ ఆ ఛాన్స్ తీసుకోలేదు!
బాలీవుడ్ జోడీ రణబీర్ కపూర్-అలియాభట్ లను తన ఇంటికి ఆహ్వనించి వంట వార్పు చేసి ఏ రేంజ్ లో ట్రీట్ ఇచ్చారో తెలిసిందే.
By: Tupaki Desk | 26 Sep 2024 6:20 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రభాస్ టైపే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ కేవలం వండిన వంటకాలు సహ నటులకు అందించడం వరకే. కానీ తారక్ అలా కాదు. స్వయంగా తానే వండి చికెన్ బిర్యానీలు వడ్డిస్తుం టారు. బాగా క్లోజ్ అయిన వారిని స్వయంగా ఇంటికి ఆహ్వానించి విందు పార్టీలు ఇస్తుంటారు. ఇది తారక్ కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. బాలీవుడ్ జోడీ రణబీర్ కపూర్-అలియాభట్ లను తన ఇంటికి ఆహ్వనించి వంట వార్పు చేసి ఏ రేంజ్ లో ట్రీట్ ఇచ్చారో తెలిసిందే.
హైదరాబాద్ నాన్ వెజ్ రుచులన్నింటినీ ఆ జోడికి చూపించాడు. మరి `దేవర` కోస్టార్ జాన్వీకి ఎలాంటి ట్రీట్ ఇచ్చాడు? అంటే ఆ బ్యూటీకి కూడా ఇంటి నుంచి సెట్స్ కి హైదరాబాద్ లో షూట్ జరిగినన్ని రోజులు బిర్యానీలు పంపించినట్లు తెలిపాడు. మరి ప్రతిగా జాన్వీ కపూర్ ...తారక్ ముంబైలో ఉన్నప్పుడు అలాంటి పనులేవైనా చేసిందా? అంటే తారక్ లేదనేసాడు. `నేను మా ఇంటి నుంచి బిర్యానీలు పంపాను.
కానీ నేను ముంబైలో షూటింగ్ చేసిన సమయంలో తన ఇంటి నుంచి ఎలాంటి ఫుడ్ రాలేదు. కనీసం ఆర్డర్ కూడా పెట్టి పుడ్ ఇవ్వలేదు జాన్వీ` అని ఓ ఇంటర్వ్యూలో నవ్వేసాడు. అంటే తారక్ విషయంలో జాన్వీ అంత చొరవ తీసుకోలేదని తెలుస్తోంది. తారక్ ఎంతో జోవియల్ పర్సన్. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మనస్తత్వం గలవాడు. ప్లూయిడ్ గా ఉంటాడు. ఏవిషయం అయినా ఓపెన్ గా మాట్లాడాతాడు.
కాబట్టే తారక్ సహ నటులతో అలా ఉండగల్గుతున్నాడు. అలాగని అందరూ తారక్ లా ఉండలేరు. కొందరికి కలవడానికి సమయం పడుతుంది. బాగా క్లోజ్ అయితే తప్ప ఇంటికి ఆహ్వానించే పరిస్థితి ఉండదు. ఈ విషయంలో జాన్వీ కపూర్ కాస్త నెమ్మది. అలాగే అమ్మడు సిగ్గరి కూడా. దేవర ప్రారంభోత్సవంలోనూ టీమ్ అందరితో కలవలేకపోయింది. అంతా కొత్త వారు కావడంతో సర్దుకోవడంలో ఇబ్బంది పడింది. అలాంటి జాన్వీ ..తారక్ కోసం లంచ్..డిన్నర్ ఏర్పాటు చేసేంత ధైర్యం చేయలేకపోయింది.