జాన్వీ.. చేతిలోకి మరో స్ట్రాంగ్ కంటెంట్
కేరళ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమాతెరకెక్కుతోన్నట్లు పోస్టర్ బట్టి తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2024 11:30 PM GMTబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ మూవీ హిట్ కావడంతో ఆమెకి కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా ‘RC 16’ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలుస్తోంది.
మరో వైపు ‘దేవర’ మూవీ తర్వాత బాలీవుడ్ లో కూడా జాన్వీ కపూర్ కి క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సిద్ధార్ధ్ మల్హోత్రాకి జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. తాజాగా మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ బ్యానర్ లో ‘పరమ సుందరి’ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తుషార్ జలోటా దర్శకత్వంలో రెడీ అవుతోన్న ఈ సినిమాలో సుందరి క్యారెక్టర్ లో జాన్వీ కపూర్ కనిపించబోతోంది.
కేరళ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమాతెరకెక్కుతోన్నట్లు పోస్టర్ బట్టి తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో జాన్వీ కపూర్ అచ్చమైన కేరళ కుట్టీలా ఉంది. నెటిజన్లు కూడా ఆమె ఫోటో చూసి అలాగే కామెంట్స్ చేస్తున్నారు. అచ్చమైన సౌత్ ఇండియన్ స్టైల్ జాన్వీ లుక్ లో ఉట్టిపడుతుందని అంటున్నారు.
కేరళ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అంటే కచ్చితంగా ఇంటరెస్టింగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన గ్రేస్ తో జాన్వీ కపూర్ హార్ట్స్ మెల్ట్ చేస్తోందని మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆమె ఫస్ట్ లుక్ ని షేర్ చేశారు. అలాగే 2025 జులై 25న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోందని కూడా ప్రకటించారు.
మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ లో ఇటీవల కాలంలో హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు గట్టిగానే వచ్చాయి. స్త్రీ 2 ఏ స్థాయిలో సక్సెల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు జాన్వీ అలాంటి సంస్థలో చేస్తోంది అంటే తప్పకుండా డిఫరెంట్ కంటెంట్ తో సినిమా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ త్వరలోనే వస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
జాన్వీ కపూర్ కి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎక్కువగా గ్లామర్ అవుట్ ఫిట్ లలోనే కనిపిస్తూ ఉంటుంది. మొదటి సారి ట్రెడిషనల్ స్టైల్ లో చీరకట్టులో కనిపిస్తూ అచ్చం తన తల్లి శ్రీదేవిని గుర్తుచేస్తుందని అంటున్నారు. సౌత్ ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోంది కాబట్టి మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారేమో అనేది చూడాలి.