స్కూల్ ఈవెంట్లో జాన్వీ వింత వేషం?
జాన్వీ కపూర్ ఇటీవల `దేవర` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 400కోట్లు వసూలు చేసింది.
By: Tupaki Desk | 22 Dec 2024 10:18 AM GMTజాన్వీ కపూర్ ఇటీవల `దేవర` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 400కోట్లు వసూలు చేసింది. తన తల్లిగారైన శ్రీదేవిని పెద్ద స్టార్ ని చేసిన పరిశ్రమలో ఇంత పెద్ద గ్రాండ్ స్టార్ట్ జాన్వీలో ఆనందం నింపింది. తదుపరి మరో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోల సరసన ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది.
అదే సమయంలో జాన్వీ కపూర్ ముంబైలో ర్యాంప్ షోలు, ఈవెంట్లలోను అదరగొడుతోంది. తాజాగా ముంబైలో అత్యంత వైభవంగా జరుగుతున్న ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో జాన్వీ కపూర్ కళ్లుచెదిరే ట్రీటిచ్చింది. ఈ బ్యూటీ మిరుమిట్లు గొలిపే డిజైనర్ దుస్తుల్లో మెరుపులు మెరిపించింది.
మిరుమిట్ల పింక్ కలర్ మినీ డ్రెస్ లో జాన్వీ చాలా అద్భుతంగా కనిపించింది. మెరిసే హీల్స్ మెరిసే గ్లామ్ మేకప్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంది. అయితే ఒక స్కూల్ ఈవెంట్లో ఈ తరహా వస్త్రధారణ సరికాదని కొందరు నెటిజనులు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇదే ఈవెంట్ లో పలువురు అందాల భామలు గ్లామరస్ దుస్తుల్లో కనిపించినా జాన్వీ కొంత హై ఎండ్ గ్లామర్ ని ఎలివేట్ చేసే దుస్తుల్లో కనిపించిందని వాదిస్తున్నారు. ఇదేమీ రెగ్యులర్ ర్యాంప్ షో కాదు.. ఫ్యాషన్ షో అసలే కాదు. పేరెంట్‌తో కలిసి పిల్లలు ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఈవెంట్ ని తిలకించే సందర్భం. ఇలాంటి వేదికకు కూడా జాన్వీ ఇంత గ్లామరస్‌గా రావాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. ప్రస్తుతం జాన్వీ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
అంబానీ స్కూల్‌లో చదవలేదు:
ఆసక్తికరంగా జాన్వీ కపూర్ తాను ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంబైలోని ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకున్నానని, అయితే ప్రతిష్టాత్మక అంబానీ స్కూల్‌లో చదివిన తన స్నేహితుల కారణంగా తాను కూడా అదే స్కూల్ లో చదివానని అనుకుంటారని కూడా తెలిపింది. బాలీవుడ్ లో చాలామంది స్టార్ కిడ్స్ అంబానీ స్కూల్ లోనే విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఆ తర్వాత మాస్టర్స్ కోసం విదేశాల బాట పడుతున్నారు.