పిక్ టాక్ : పుష్ప 2 కోసం జాన్వీకపూర్ ఇలా!
మొత్తానికి పుష్ప 2 పేరును ఈ ఫోటోలతో జాన్వీ కపూర్ షేర్ చేయడం ద్వారా ఎక్కువ రీచ్ వచ్చింది. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 10 Dec 2024 6:59 AM GMT
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో 2018లో రొమాంటిక్ డ్రామా ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో నటించింది. కానీ ఈమె చేసిన ఏ ఒక్క హిందీ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.
కానీ తెలుగులో ఈమె నటించిన మొదటి సినిమా దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది దసరా ముందు వచ్చిన దేవర సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి బుచ్చిబాబు సినిమాలో నటిస్తోంది.
రామ్ చరణ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమాలో నటించాలని ఈమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పుష్ప 2 సినిమా కోసం చాలా పాజిటివ్ ప్రచారం చేసింది. సినిమాను చూసిన తర్వాత తన పాజిటివ్ రివ్యూ ఇవ్వడం మాత్రమే కాకుండా సినిమా చూడ్డానికి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ పుష్ప 2 స్టార్స్ అంటూ ఆ ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జాన్వీక పూర్ పుష్ప 2 సినిమా చూడ్డానికి ఇంత స్టన్నింగ్ లుక్‌తో వెళ్లిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.
మొత్తానికి పుష్ప 2 పేరును ఈ ఫోటోలతో జాన్వీ కపూర్ షేర్ చేయడం ద్వారా ఎక్కువ రీచ్ వచ్చింది. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ ఏ అందమైన ఫోటోలు షేర్ చేసినా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా క్లీ వేజ్ షో తో ఆకట్టుకుంది. ఈ స్థాయి అందాల ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో సరైన హిట్ దక్కక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తక్కువ సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కలేదు. కానీ ఈమెకు టాలీవుడ్‌లో సూపర్ హిట్ దక్కింది.
దేవర సినిమా విడుదలకు ముందే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దేవర సినిమాలో మాదిరిగా కాకుండా ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతుంది అంటూ ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. 2025లో విడుదల కాబోతున్న చరణ్, జాన్వీ కపూర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక చరణ్ తో సినిమా తర్వాత తెలుగులో ఆమె చేయబోతున్న సినిమాపై క్లారిటీ లేదు. కానీ అల్లు అర్జున్ సినిమా కోసం త్రివిక్రమ్ ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. త్వరలోనే మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.