వాళ్ల గూబ గీయిమనిపించిన జాన్వీ కపూర్!
దీంతో కొందరు ఇండియాకి సినిమా తీసే అర్హత లేదు అనే స్థాయిలో ఓ పేరున్న మీమ్ పేజీ పోస్ట్ చేసింది. అయితే ఈవిషయం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కంట పడింది.
By: Tupaki Desk | 7 Dec 2024 4:45 AM GMT`పుష్ప-2` పాన్ ఇండియాని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే వసూళ్లతో అన్ని సినిమాల డే వన్ రికార్డులను తుడిచి పెట్టేసింది. బాక్సాఫీస్ వద్ద చరికొత్త చరిత్రను రాస్తుంది. ఓవైపు బన్నీ వ్యతిరేక వర్గం సినిమాని బ్యాడ్ చేయాల ని ప్రయత్నిస్తున్నా? ఏమాత్రం పనవ్వడం లేదు. వైల్డ్ ఫైర్ అన్నట్లే దూకుడు చూపిస్తుంది. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ అక్కడా చరిత్ర సృష్టిస్తున్నాడు.
ఇప్పట్లో కొత్త రిలీజ్ లు కూడా లేవు . దీంతో పుష్ప-2 మేనియా కొన్ని రోజుల పాటు యధేశ్చగా కొనసాగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే పుష్ప-2తో పాటే డిసెంబర్ 6 హాలీవుడ్ చిత్రం `ఇంటర్ స్టెల్లార్` పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐమాక్స్ లో రీ రిలీజ్ చేసారు. అయితే ఇండియాలో మాత్రం రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమా ఇక్కడ రిలీజ్ కాకపోవడంపై ఇంగ్లీష్ సినిమా లవర్స్ కొంత మంది ఫీలవుతున్నారు.
దీంతో కొందరు ఇండియాకి సినిమా తీసే అర్హత లేదు అనే స్థాయిలో ఓ పేరున్న మీమ్ పేజీ పోస్ట్ చేసింది. అయితే ఈ విషయం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కంట పడింది. దీంతో అమ్మడు వాళ్లను చెడుగుడు అడేసింది. `సొంతింటి రుచి కంటే పొరుగింటి పుల్లకూరే రుచిగా ఉందా? అంటూ సెటైర్ వేసింది. పుష్ప2 కూడా సినిమానే. ఇతర భాషా చిత్రం కోసం మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. అందరూ `పుష్ప2` ను అలరిస్తుంటే మనం మాత్రం పక్క సినిమా సంగతేంటి? అని ఆలోచిస్తున్నాం.
ఇది ఎంత మాత్రం బావ్యం కాదని విచారం వ్యక్తం చేసింది. దీంతో జాన్వీ కామెంట్లకు చాలా మంది మద్దతు పలికారు. జాన్వీ చెప్పింది వంద శాతం నిజం. అదేదో కొత్త సినిమా రిలీజ్ అయినట్లు అనవసరంగా ఇప్పుడా ఇంగ్లీష్ సినిమాకి ఎలివేషన్ అవసరమా? అంటూ నెటి జనులు మండిపడుతున్నారు.