జాన్వీకపూర్ కి మళ్లీ షాక్ ఇచ్చిన యూనిట్!
ఆ సినిమా విడుదల వాయిదాతో జాన్వీ కపూర్ ఇబ్బంది పడుతోందా? కొత్త ఏడాది ఆరంభంలోనే అమ్మడికి ఇక్కట్లు తప్పడం లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.
By: Tupaki Desk | 6 Feb 2025 7:09 AM GMTఆ సినిమా విడుదల వాయిదాతో జాన్వీ కపూర్ ఇబ్బంది పడుతోందా? కొత్త ఏడాది ఆరంభంలోనే అమ్మడికి ఇక్కట్లు తప్పడం లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ లో బాలీవుడ్ లో 'పరమ్ సుందరి', 'సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ'లో నటిస్తోంది. వీటితో పాటు తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 16వ చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారీ' మరోసారి వాయిదా పడింది.
అనుకున్న టైమ్ లో షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసారు. ఈ సినిమా ఇంకా 25 రోజులు షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న దానిపై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడటం కారణంగా జాన్వీ కి ఇతర సినిమాలతో డేట్లు క్లాష్ అవుతున్నాయట. ముఖ్యంగా రామ్ చరణ్ తో నటిస్తోన్న సినిమా షూటింగ్ కి అంతరాయం ఏర్పడుతుందట.
జాన్వీ కపూర్ 25 రోజుల్లో 15 రోజుల పాటు కంటున్యూగా షూటింగ్ కి హాజరవ్వాల్సి ఉందట. అయితే చరణ్ సినిమాకి కేటాయించిన డేట్లలోనే ఈ 15 రోజులు కూడా క్లాష్ కి వస్తున్నాయట. దీంతో జాన్వీ కపూర్ కి ఏం చేయాలో అర్దం కాని సందిగ్దంలో పడిందంటున్నారు. ఒకే సమయంలో ముంబై టూ హైదరాబాద్ తిరగడం సాద్యం పడదు. రెండు సినిమాల షూటింగ్ ఒకే చోట అయితే ఇబ్బంది ఉండదు. `పరమ్ సుందరి`, 'సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి' షూటింగ్ లను ఇప్పటివరకూ అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది.
కానీ రామ్ చరణ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి వీలు పడదు. ఈ నేపథ్యంలో డేట్లు క్లాష్ అవ్వకుండా చరణ్ మేకర్స్ నో, హిందీ సినిమా వాళ్లనే సర్దుబాటు చేయమని అడగాల్సిన పరిస్థితి. డిలే కారణంగా వాయిదా వేసారు కాబట్టి ఈ విషయంలో బాలీవుడ్ మేకర్సే వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఇప్పటికే చరణ్ సినిమాకి సంబంధించి జాన్వీ షెడ్యూల్ ఫిక్స్ అయింది.