Begin typing your search above and press return to search.

దేవర పై జాన్వీ కాన్ఫిడెన్స్.. ఏ రేంజ్ లో ఉందంటే..

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా హీరోయిన్ జాన్వీ కపూర్.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Sep 2024 9:18 AM GMT
దేవర పై జాన్వీ కాన్ఫిడెన్స్.. ఏ రేంజ్ లో ఉందంటే..
X

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా హీరోయిన్ జాన్వీ కపూర్.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే బీ టౌన్ లో చిన్న హీరోల సినిమాల్లో నటించిన అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ లోకి బడా హీరో.. ముఖ్యంగా తన ఫేవరెట్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవరతో అడుగుపెడుతోంది.

ఇంకా దేవర రిలీజ్ కాకముందే.. జాన్వీ కపూర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. మెగా హీరో రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో రానున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీలో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. అలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇవ్వకపోయినా.. టాలీవుడ్ లో మాత్రం సత్తా చాటే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

దేవర నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో జాన్వీ ఓ రేంజ్ లో మెప్పించింది. సాంగ్స్ లో తన అందం, డ్యాన్స్ తో ఫిదా చేసింది. దావూదీ సాంగ్ లో తారక్ తో సమానంగా డ్యాన్స్ వేసి అబ్బురపరిచింది. సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జోస్యం చెప్పింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది అమ్మడు.

స్టార్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. దేవర టీమ్ తో సరదాగా ముచ్చటించారు. క్రేజీ ఫన్ తో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో దేవర రిజల్ట్ పై తన మనసులోని మాటలను బయట పెట్టింది జాన్వీ. సినిమా చూశాక.. మైండ్ బ్లో అవ్వడం ఖాయమని చెప్పింది. మంచి హిట్ సాధించడం పక్కా అని వ్యాఖ్యానించింది. టాలీవుడ్ లో మరిన్ని బిగ్ ప్రాజెక్టుల్లో భాగం కావాలనుకుంటున్నట్లు ఇన్ డైరెక్ట్ గా తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్.. తంగం రోల్ లో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ లో అచ్చ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అలరించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న దేవరపై మంచి అంచనాలే పెట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో? జాన్వీ తెలుగు డెబ్యూతో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.