చీరలో మెరిసిపోతున్న జాన్వీ.. వ్వాటే లుక్!
ఇన్స్టాగ్రామ్ లో తన స్టైలిష్ ఫోటోషూట్లు, ట్రెండీ అవుట్ఫిట్లు, గ్లామరస్ లుక్స్ తో ఎల్లప్పుడూ ఫ్యాషన్ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటోంది.
By: Tupaki Desk | 7 Nov 2024 4:32 PM GMTబాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ తన తాజా ఫోటోషూట్ లో మరోసారి ఫాలోవర్స్ మనసు దోచేసింది. కాస్తా కాంతితో కూడిన మిళితమైన చీరలో కనువిందు చేస్తోంది. "కెసాటా తినాలని అనిపించింది, కానీ దాన్ని ధరించాను" అంటూ చమత్కారమైన క్యాప్షన్ తో ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చీరలో ఆమె అందం, ఆకర్షణ, అలాంటి చక్కటి ఫోటోలకు అదనపు మెరుగులు అంటిస్తోంది.
జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమా "ధడక్" ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన జాన్వీ, తన ఫస్ట్ మూవీలోనే నటిగా తన సత్తాను నిరూపించుకుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె తన సహజమైన అభినయం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రంతో మంచి మార్కులు సాధించిన జాన్వీ, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అయితే చూడలేదు. ఇక తదుపరి ప్రాజెక్టుల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శించేందుకు ముందుకు వచ్చింది. జాన్వీ "గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్" చిత్రంలో చేసిన పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. భారత వైమానిక దళంలో పనిచేసిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ తన భిన్నమైన నటనతో ఆకట్టుకుంది.
ఈ పాత్ర ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తదుపరి చిత్రాలు "రూహి," "గుడ్ లక్ జెర్రీ" వంటి చిత్రాల్లో నటిస్తూ విభిన్న పాత్రలు చేపడుతోంది. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమాతో అమ్మడు ఫైనల్ గా పాన్ ఇండియా సక్సెస్ చూసింది. ప్రస్తుతం రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండి తన ప్రత్యేకతను చాటుతోంది. ఇన్స్టాగ్రామ్ లో తన స్టైలిష్ ఫోటోషూట్లు, ట్రెండీ అవుట్ఫిట్లు, గ్లామరస్ లుక్స్ తో ఎల్లప్పుడూ ఫ్యాషన్ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటోంది. ప్రతీ ఫోటోషూట్ లో ఆమె కొత్తగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది.