Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడ్ని జాన్వీ జాకీతో లేపే ప్ర‌య‌త్న‌మా?

'ధ‌డ‌క్' తో ఈఫెయిర్ కి మంచి గుర్తింపు వ‌చ్చింది. సినిమాలో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ముద్దు స‌న్నివేశాల్లో ఎంతో చ‌క్కాగా న‌టించారు.

By:  Tupaki Desk   |   22 Sep 2024 5:36 AM GMT
మాజీ ప్రియుడ్ని జాన్వీ జాకీతో లేపే ప్ర‌య‌త్న‌మా?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ తొలి హీరో ఇషాన్ క‌ట్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు 'ధ‌డ‌క్' సినిమాతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ్యారు. అదే స‌మ‌యంలో అమ్మ‌డు ఇషాన్ తో ల‌వ్ లోనూ ప‌డింది. కొన్నాళ్ల పాటు సిరియ‌స్ గా ప్రేమాయ‌ణం సాగించింది. కానీ అది ఎంత కాల‌మో సాగ‌లేదు. జాన్వీ కెరీర్ పై ఫోక‌స్ పెట్ట‌డంతో ఇషాన్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ త‌ర్వాత జాన్వీ మ‌న‌సులోకి శిఖ‌ర్ ప‌హారియా ప్ర‌వేశించాడు.

ప్రస్తుతం ఇద్ద‌రు సీరియ‌స్ లవ్ లో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకుంటార‌నే ప్ర‌చారం బ‌లంగా సాగుతోంది. ఇక ప్రోఫెష‌న‌ల్ గా జాన్వీ కెరీర్ ఎలా ఉందో తెలిసిందే. జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. కానీ ఇషాన్ కెరీర్ మాత్రం ఇంకా పుంజు కోలేదు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. సినిమాలు చేస్తున్నా స‌క్సెస్ లు రావ‌డం లేదు. దీంతో యంగ్ హీరోల రేసులో వెనుక బ‌డుతున్నాడు.

ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో ఇషాన్ ఓ సినిమా చేస్తున్నాడు. దీన్నినీర‌జ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ ఎవ‌రు? అన్నది ఇంకా ఫైన్ చేయ‌లేదు. కానీ ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ గెస్ట్ పాత్ర‌కోసం క‌ర‌ణ్ దించుతున్నాడు. ఇప్ప‌టికే జాన్వీని సంప్ర‌దించ‌గా ఆమె అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే హీరోయిన్ లేకుండానే? జాన్వీని కీల‌క పాత్ర కి ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

'ధ‌డ‌క్' తో ఈఫెయిర్ కి మంచి గుర్తింపు వ‌చ్చింది. సినిమాలో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ముద్దు స‌న్నివేశాల్లో ఎంతో చ‌క్కాగా న‌టించారు. అందుకే మ‌రోసారి క‌ర‌ణ్ తెలివిగా జాన్వీని తెర‌పైకి తెస్తున్నాడు. సినిమాలో జాన్వీ ఉంటే బిజినెస్ ప‌రంగా క‌లిసొచ్చే అంశం. ఆమె క్రేజ్ తో తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంటుంది. 'దేవ‌ర‌' తో జాన్వీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.