జాన్వీ ఇంట రొయ్యల ఘుమ ఘుమలు!
జన్వీ కపూర్ ని వెండితెరపై అందమైన పాత్రల్లో చూసాం. ఆన్ సెట్స్ లో ఎలా ఉంటుందో చూసాం.
By: Tupaki Desk | 24 Sep 2024 4:30 PM GMTజన్వీ కపూర్ ని వెండితెరపై అందమైన పాత్రల్లో చూసాం. ఆన్ సెట్స్ లో ఎలా ఉంటుందో చూసాం. ఆఫ్ ది సెట్ కూడా జాన్వీ మురిపం తెలిసిందే. ఇక ఇన్స్టా లో అమ్మడు కొత్త కొత్త ఫోటోలతో ఎలా సెగలు పుట్టిస్తుందో? కూడా తెలిసిందే. మరి జాన్వీ కపూర్ ని ఎప్పుడైనా కిచెక్ లో చూసారా? అందులోనూ వంట చేయడం చూసారా? ఇంకా ముందుకెళ్తే అమ్మడు రొయ్యల కర్రీ చేయడం చూసారా? అంటే ఇప్పుడు చూసే యాల్సిందే.
ఇదిగో ఇక్కడిలా అమ్మడు కిచెన్ లో ఇలా ఘమ ఘుమలాడే రొయ్యలతో వంటకం చేస్తుంది. ఆ ఘుభాళింపు మూములుగా లేదు. అచ్చంగా ప్రోఫెషనల్ చెఫ్ లాగే పెనం ఎగరేస్తూ మరీ కలుపుతోంది. రెయ్యల కర్రీ పాత్రకు అడుగంటకుండా? మోతాదులో అన్ని వేసి వాటిని మిక్సీచేసి డీప్ ప్రైవ్ చేస్తోంది. జాన్వీని ఒక్కసారిగా ఇలా ఇంత పెద్ద కిచెన్ లోచూసి అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇదేదో రెస్టారెంట్ హోటల్ కిచెన్ లా చాలా పెద్దగా ఉంది.
మరి దానికి సంబంధించిన కిచెనా? లేక బోనీ కపూర్ ఇంట్లోనే ఇంత పెద్ద కిచెన్ ఏర్పాటు చేసుకున్నారా? అన్నది తెలియాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జాన్వీ రొయ్యల వంటకానికి అంతా పిధా అవుతున్నారు. మాకు కూడా కొంచెం రొయ్యల కర్రీపంపించు జాన్వీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక జాన్వీ మరో నాలుగు రోజుల్లో `దేవర` సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైపోయింది. దేశ వ్యాప్తంగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా జాన్వీ తెలుగులో మాట్లాడుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.