దేవుని దేశంలో దేవతలా మెరిసిపోతున్న జాన్వీ
తెల తెల్లని కాటన్ చీర.. మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజు ధరించి కొంటె కోనంగి క్రీగంటి చూపులతో కిల్ చేస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2025 11:39 AM GMTతెల తెల్లని కాటన్ చీర.. మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజు ధరించి కొంటె కోనంగి క్రీగంటి చూపులతో కిల్ చేస్తోంది. అలా అందమైన శిరోజాలను సరిచేస్తూ ముడి వేస్తూ ఒద్దికగా కళ్లు తిప్పుతూ కనిపించింది. గుండెల్లో జిల్లనిపిస్తోంది. కుర్రకారు మనసును గుల్ల చేస్తోంది.. అంతగా కిక్కిస్తున్న ఈ దేవకన్య ఎవరో ఆరా తీస్తున్నారా? అంతగా ఆరాలు అవసరం లేదు. ఈ బ్యూటీ పేరు- జాన్వీ కపూర్. మామ్ శ్రీదేవి నటవారసురాలు.
తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో నిరంతరం యువతరం హృదయాలను కొల్లగొడుతున్న జాన్వీ కపూర్ ఈసారి తెల్ల చీరలో జిల్లనిపించింది. ప్రస్తుతం దేవుని దేశం కేరళ పచ్చదనంలో ప్రకృతి దేవతలా ఒదిగిపోయింది. ప్రతిచోటా మెరుపులే మెరుపులు.. తెల్ల చీరలో రకరకాల భంగిమల్లో జాన్వీ కెమెరాలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్‌గా మారాయి.
చర్చిలో నిశ్శబ్ద క్షణాలు గడపడం.. సూర్యరశ్మిలో సమయం కేటాయించడం.. కేరళ సహజ సౌందర్యాన్ని.. ప్రశాంతతను ఆస్వాధించడం.. ఏనుగులకు ఆహారం ఇవ్వడం.. స్నేహితులతో టీ తాగడం.. ఇలా ప్రతిదీ ఆనందాన్నిచ్చేదే. ముఖ్యంగా ప్రకృతితో సాంత్వన దొరుకుతుంది. అలాంటి సాంత్వనను తన సొంతం చేసుకున్న ఆనందం జాన్వీలో కనిపిస్తోంది. క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ముంబై నగరంలో బిజీబిజీగా ఉండే జాన్వీ, ఇప్పుడు కేరళ యాత్రలో పూర్తిగా రిలాక్స్ అవుతోంది. జాన్వీ నటించిన `దేవర` గత ఏడాది విడుదలై పాన్ ఇండియన్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తన సోదరి ఖుషికపూర్ నటించిన మొదటి చిత్రం లవ్ యాపా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఖుషి సినిమాకు ప్రచార సాయం చేస్తోంది.