జాన్వీ కపూర్.. గోల్డెన్ గ్లామర్‌లో మెరిసిన అందం
ఈ అవుట్‌ఫిట్ స్పెషల్ గా ఒకే రోజు డిజైన్ చేయించుకోవడం గమనార్హం.
By: Tupaki Desk | 11 March 2025 11:00 PM ISTబాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్ మరోసారి తన గ్లామర్‌తో హాట్ టాపిక్ గా మారింది. తన మొదటి సోలో డాన్స్ నంబర్ ‘నడియోన్ పార్’ కి సంబంధించిన తన అనుభవాలను పంచుకుంటూ గోల్డెన్ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అవుట్‌ఫిట్ స్పెషల్ గా ఒకే రోజు డిజైన్ చేయించుకోవడం గమనార్హం.
మణీష్ మల్హోత్రా డిజైనింగ్‌లో మెరిసిన ఈ గోల్డెన్ డ్రెస్‌లో జాన్వీ అందాల విందు చేస్తూ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ క్రియేట్ చేసింది. ఈ డాన్స్ నంబర్ కోసం జాన్వీ మూడు రోజుల పాటు రిహార్సల్స్ చేసింది. మధ్యలో ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా షూటింగ్ చేసుకుంటూ, పాటియాలాలో రాత్రంతా షూట్ చేసి, ఉదయాన్నే ముంబైకి తిరిగొచ్చి ‘నడియోన్ పార్’ సాంగ్‌ను ఏడు గంటల్లో పూర్తి చేసేసిందట.
అంతేకాదు, ఏ మాత్రం నిద్ర లేకుండా మళ్లీ షూటింగ్ లోకి వెళ్లడం తనకు నిజంగా ఓ మైండ్ బ్లోయింగ్ అనుభవంగా అనిపించిందని చెప్పింది. ఏ మాత్రం అలసట లేకుండా, అద్భుతమైన ఎక్సప్రెషన్స్, గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తో ఈ పాటను పూర్తి చేయడం ఆమె కెరీర్‌లో ఒక స్పెషల్ అచీవ్‌మెంట్ గా నిలిచింది. ఈ గోల్డెన్ అవుట్‌ఫిట్ కేవలం 24 గంటల్లో తయారు చేయించుకున్నట్లు జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. మణీష్ మల్హోత్రా చివరి నిమిషంలో తన కోసం ఈ డ్రెస్ డిజైన్ చేశారని, అతను నిజంగా ఓ నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్ లాంటివారని కామెంట్ చేసింది.
కత్రినా కైఫ్ తనకు స్టైలింగ్, మేకప్, డాన్స్ విషయాల్లో ఇన్‌స్పిరేషన్ అని పేర్కొనడం విశేషం. జాన్వీ గ్లామరస్ లుక్స్ కు బాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గోల్డెన్ కలర్ లో ఆమె మెరుపులు పూయించిన ఈ ఫోటోషూట్ ఆమె అభిమానులకు మరింత కనువిందు చేసింది. ‘రూహి’ సినిమాకు నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈ డాన్స్ నంబర్ ఆమె కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది. మొదటి సోలో డాన్స్ నంబర్ కావడంతో ఎంతో నర్వస్ గా ఫీల్ అయ్యానని, లైట్స్ కింద మళ్లీ మళ్లీ కళ్ళు మూసుకునేదానినని, కానీ చివరికి ఫైనల్ అవుట్‌పుట్ చూసి ఎంతో సంతృప్తి కలిగిందని చెప్పింది.