పెళ్లి, తిరుపతి, ముగ్గురు పిల్లలు... జాన్వీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే
తాను తిరుపతిలో పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలోనే జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
By: Tupaki Desk | 23 Jan 2025 9:05 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలం అవుతోంది. టాలీవుడ్ ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ 'దేవర' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో దక్కని హిట్ టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి దక్కింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా పలు తెలుగు సినిమాల నుంచి ఆఫర్‌లు వస్తున్నా ఈ అమ్మడు మాత్రం హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు సార్లు జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడింది. తాను తిరుపతిలో పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలోనే జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
తాజాగా కరణ్ జోహార్ టాక్ షోలో జాన్వీ కపూర్ మరోసారి పాల్గొంది. ఆ సమయంలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు అనుకోవడం లేదు. కానీ కచ్చితంగా తాను తిరుమలలో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో కలిసి తిరుమలలోనే సెటిల్ అవ్వాలి అన్నది కోరిక. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి భర్త, పిల్లలతో తిరుమలలో ఉంటూ, ప్రతి రోజూ అరటి ఆకులో అన్నం తింటూ, గోవిందా గోవిందా అని స్మరించుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. ఆ సమయంలో మణిరత్నం సినిమాల్లోని సాంగ్స్ ఉండాలని ఆశ పడుతున్నాను అంది.
జాన్వీ కపూర్ కి ముగ్గురు పిల్లల కోరిక విచిత్రంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఎక్కువ శాతం మంది స్టార్స్, సెలబ్రిటీలు, సాదారణ జనాలు అంతా ఇద్దరు పిల్లలను కోరుకుంటున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం ముగ్గురు పిల్లలను కోరుకోవడం ఒకింత ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కోరికల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. హీరోయిన్‌గా మంచి జోరు మీదున్న జాన్వీ కపూర్ ఒక వయసు వచ్చి, ఆఫర్లు తగ్గిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి పెళ్లి చేసుకుని తిరుమలలో జీవితాన్ని గడపడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ఫ్యామిలీతో ఆమె నిజంగానే తిరుమలలో ఉంటుందా అనేది అనుమానమే.
జాన్వీ కపూర్ కి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. తల్లి ఉన్నప్పుడు రెగ్యులర్‌గా వచ్చిన జాన్వీ, తల్లి చనిపోయిన తర్వాత కూడా రెగ్యులర్‌గా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటుంది. నెలలో ఒకసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సాంప్రదాయ లుక్‌లో రావడం, ఏదైనా ప్రత్యేక రోజుల్లోనూ ఆమె శ్రీవారిని దర్శించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు చాలా అరుదుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే జాన్వీ కపూర్ మాత్రం రెగ్యులర్‌గా స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఆమెకు ఉన్న భక్తిని చూస్తే ముచ్చటేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు.