Begin typing your search above and press return to search.

నాగచైతన్య కోసం బాలీవుడ్ బ్యూటీ

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ని కథానాయికగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట.

By:  Tupaki Desk   |   30 Oct 2024 3:30 PM GMT
నాగచైతన్య కోసం బాలీవుడ్ బ్యూటీ
X

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ, యువ సామ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతున్న‌ట్లు క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. 'మజిలి' సినిమాతో ఈ కాంబో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక మరో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇదొక ల‌వ్ స్టోరీ అని సమాచారం. శివ నిర్వాణ ల‌వ్ స్టోరీలను స‌హ‌జంగా, ఎమోషనల్ గా తీర్చిదిద్దడంలో నిపుణుడు.

ఆయ‌న డైరెక్ష‌న్‌లో వచ్చిన సినిమాలు ఎక్కువగా భావోద్వేగాలు ప్రధానంగా ఉండే లవ్ స్టోరీస్ కావడం విశేషం. ఇప్పుడు చైతూకి కూడా అలాంటి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య 'తండేల్‌' అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుందని టాక్. సంక్రాంతికి రాకపోతే, ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం చైతూ బాడీ లాంగ్వేజ్, ఫిట్‌నెస్ పరంగా చాలా కష్టపడుతున్నాడట.

యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగ చైతన్య రియలిస్టిక్ రోల్‌లో కనిపించనున్నాడు. దాంతో, ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే చైతూ తన స్టైల్ మార్చుకొని, సాఫ్ట్ లవ్ స్టోరీ వైపు వెళ్లాలనుకుంటున్నాడట. అందుకే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెరిగింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ని కథానాయికగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ ఇప్పటికే దేవర సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంది. అలాగే త్వరలో స్టార్ట్ కాబోయే రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుంది. ఇక ఇప్పుడు, అక్కినేని వారసుడితో ఆమె జతకట్టడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జాన్వీ తల్లి శ్రీదేవి గతంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునలతో కలిసి సినిమాలు చేశారు.

ఇప్పుడు ఆమె వారసురాలు నాగ చైతన్యతో జతకట్టడం ఒక రకంగా అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా అనిపించేది. కాంబినేషన్‌ విషయంలో ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ, కాంబినేషన్ దాదాపుగా ఫైనల్‌ అయినట్లు సమాచారం. ఇక మరోవైపు నాగచైతన్య మరో ప్రాజెక్టు కు సంబంధించి త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడు.