Begin typing your search above and press return to search.

ప‌ప్పుల పొడి ఎక్కువైతే అద‌నంగా అర‌గంట అదే ప‌ని!

జాన్వీక‌పూర్ ఫిట్ నెస్ ప్రీక్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. రోజులో కొంత స‌మ‌యాన్ని జిమ్, యోగా కు కేటాయి స్తుంది.

By:  Tupaki Desk   |   27 March 2025 2:30 PM
Janhvi Kapoor Love for Pappula Podi
X

జాన్వీక‌పూర్ ఫిట్ నెస్ ప్రీక్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. రోజులో కొంత స‌మ‌యాన్ని జిమ్, యోగా కు కేటాయి స్తుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా జిమ్ చేయ‌డం అల‌వాటు. సెల‌బ్రిటీ లైఫ్ లో ఇలాంటివ‌న్నీ స‌హ‌జం. పోటీలో రాణించాలంటే ఎన్నో ర‌కాల త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెల‌బ్రిటీలు నోరు క‌ట్టు కోవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ఇష్ట‌మైన అన్ని ర‌కాల వంట‌కాలు మ‌న‌సారా తినే ప‌రిస్థితి ఉండ‌దు.

న్యూట్రీ షియ‌న్...డైటీషీయ‌న్ సూచ‌న‌లు, స‌లహాల మేర‌కు మితంగా భుజించాల్సి ఉంటుంది. ఉప్పు కారం లేని వంట‌కాల‌కు అప్పుడ‌ప్పుడు బాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే జాన్వీ క‌పూర్ మాత్రం ప‌ప్పులు పొడులు చూసిన‌ప్పుడు మాత్రం నోరు క‌ట్టుకోలేను అంటోంది. ఇంట్లో భోజనం అయితే త‌ప్ప‌ని స‌రిగా డైనింగ్ టేబుల్ పై ర‌క‌ర‌కాల ప‌ప్పులు పొడులు ఉంటాయి. ప‌ప్పుల పొడి... అన్నం..నెయ్యి క‌లుపుకుని తిన‌డం బాగా అల‌వాటు అట‌.

చిన్న‌ప్పుడు మామ్ శ్రీదేవి చేసిన అల‌వాటు ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతుందిట‌. మూడు పూట‌లు ప‌ప్పుల పొడితే తిన్న‌మ‌న్నా ఎంచ‌క్కా లాగించేస్తానంటోంది. ర‌క‌ర‌కాల క‌ర్రీలు ఉంటే గ‌నుక క‌నీసం రెండు ముద్దు లైనా పొడితో రుచి చూసిన త‌ర్వాతే మిగ‌తా క‌ర్రీల‌ను రుచి చూస్తుందిట‌. ప‌ప్పుల పొడి అన్నం ఎక్క‌వైతే మ‌రుస‌టి రోజు అర‌గంట అద‌నంగా వ్యాయామం చేస్తుందిట‌. అదీ జాన్వీ ప‌ప్పుల పొడి క‌హానీ.

ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ ఆర్సీ 16 లో రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డి తెలు గులో న‌టిస్తోన్న రెండ‌వ చిత్రం. తొలి చిత్రం `దేవ‌ర‌`లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసింది. ఇప్పుడు చ‌ర‌ణ్ తో . త‌దుప‌రి ఏ హీరోతో ఛాన్స్ అందుకుంటుందో చూడాలి. అలాగే బాలీవుడ్ లోనూ అమ్మ‌డు బిజీగానే ఉంది. అక్క‌డ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే తెలుగు సినిమాల్లోనూ కంటున్యూ అవుతోంది.