జాన్వీ కపూర్ తో మాలీవుడ్ స్టైల్ రొమాన్సా?
జాన్వీ కపూర్ టాలీవుడ్..బాలీవుడ్ రెండు పరిశ్రమల్ని చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jan 2025 9:30 AM GMTజాన్వీ కపూర్ టాలీవుడ్..బాలీవుడ్ రెండు పరిశ్రమల్ని చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే. ఫేం ఉండగానే పిండుకోవాలి అనే నిబంధన పాటిస్తూ సినిమాల కోసం ఎంతో శ్రమిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో `పరమ్ సుందరి` లో సిద్దార్ధ్ మల్హోత్రాకి జోడీగా నటిస్తోంది. `దస్వీ` ఫేం తుసార్ జలోటా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సిద్దార్ధ్ ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త పాత్ర పోషిస్తుండగా, జాన్వీ కపూర్ మలయాళీ అమ్మాయిగా నటిస్తుంది.
కథలో భాగంగా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈ వివాహం పూర్తిగా మలయాళం సంప్రదాయాల ప్రకారం జరుగుతోంది. కథలో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమాలో మాలీవుడ్ సంప్రయదాల్ని హైలైట్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా కేరళలో ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఏకంగా నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ నిర్వహి స్తారుట. కేరళ అందాలు... కొండ కోనల మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు లీకులందుతున్నాయి.
సినిమాలో కేరళ సంప్రదాయం పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేకంగా హైలైట్ కాబోతున్నాయట. అలాగే శోభనం సన్నివేశాల విషయంలో దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా ప్లానింగ్ చేస్తున్నాడుట. దీనిలో భాగంగా హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో మరింత రక్తి కట్టించడం ఖాయమే. నెల రోజుల కేరళ షెడ్యూల్ లో పెళ్లి, రొమాన్స్ తో పాటు కొన్ని పాటలకు సంబంధించిన షూట్ జరుగుతుందని వెలుగులోకి వచ్చింది.
జాన్వీ కపూర్ ఇంతవరకూ ఇంటిమేట్ సన్నివేశాల్లో పెద్దగా హైలైట్ అవ్వలేదు. పరమ్ సుందరిలో మాత్రం ఆ ఛాన్స్ తీసుకుంటున్నట్లు తె లుస్తోంది. లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలుంటాయని ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.