జాన్వీ హృదయాన్ని కదిలించిన చిత్రమిది!
తాజాగా ఈ చిత్రాన్ని అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ నెట్ ప్లిక్స్ లో వీక్షించి తన రివ్యూను కూడా పంచుకుంది.
By: Tupaki Desk | 31 Dec 2024 10:05 AM GMTఇటీవల రిలీజ్ అయిన కోలీవుడ్ చిత్రం `అమరన్` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. శివ కార్తికేయన్ కెరీర్ లో తొలి భారీ చిత్రమిది. తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన చిత్రంగా నిలిచింది. మేజర్ వరదరాజ్ ముకుందన్ జీవిత కథ ఆధరంగా రాజ్ కుమార్ పెరియా స్వామి కమర్శియల్ గా మలిచిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ఈ విజయంలో రాజ్ కుమార్ కి బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్లో నిర్మించడం మరో విశేషం. తాజాగా ఈ చిత్రాన్ని అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ నెట్ ప్లిక్స్ లో వీక్షించి తన రివ్యూను కూడా పంచుకుంది.` సినిమా చాలా ఆలస్యంగా చూసాను. కానీ ఈ ఏడాదిని ఓ మంచి సినిమాతో ముగిస్తున్నాను` అని పేర్కొంది.
`సినిమాలో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంది. సినిమా నా హృదయాన్ని కదలించింది. ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయంది. శివ కార్తికేయన్, సాయి పల్లవని నటనను ప్రశంసించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ `దేవర` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమా సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ సరసన ఛాన్స్ అందుకుంది.
అయితే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లోనే కొనసాగే ప్రణాళికతో ముందుకెళ్తుంది. మామ్ లా అమ్మడు అన్ని భాషల్లోనూ నటించాలనే ఆశతోనూ ఎదురు చూస్తోంది. అయితే అందుకు డాడ్ బోనీ కపూర్ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వాలి. ఆయన సూచనలు సలహాల మేరకే ఎంపికలు జరుగుతున్నాయి.