ఆ పాట కోసం మారథాన్‌లా నిద్రపోలేదన్న జాన్వీ
ఈ సినిమా కోసం 'నడియోన్ పార్' చిత్రీకరణకు ముందు తన 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ మధ్యలో 3 రోజులు ఆ పాటను రిహార్సల్ చేశానని జాన్వీ వెల్లడించింది.
By: Tupaki Desk | 12 March 2025 1:41 AM ISTశ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ పరిణతి చెందిన నటనతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. జాన్వీ నటించిన 'రూహీ' చిత్రం మార్చి 11 నాటికి విడుదలై నాలుగు సంవత్సరాలైంది. ఈ హారర్ కామెడీ గురించి జాన్వీ ముచ్చటిస్తూ సోషల్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.
ఈ సినిమా కోసం 'నడియోన్ పార్' చిత్రీకరణకు ముందు తన 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ మధ్యలో 3 రోజులు ఆ పాటను రిహార్సల్ చేశానని జాన్వీ వెల్లడించింది. నా మొదటి సోలో డ్యాన్స్ నంబర్ అది. నేను చాలా చిన్నపిల్లని. ఈ పాట గురించి చాలా భయపడ్డాను. తీక్షణంగా కాంతి జల్లే లైట్ల కింద కళ్ళు తెరిచి ఉంచడం ఎలాగో కూడా నేర్చుకోలేదు... గుడ్‌లక్ జెర్రీ షూటింగ్ కి వెళుతూనే.. 3 రోజులు రిహార్సల్ చేశాను. రాత్రంతా పాటియాలాలో జిఎల్‌జే కోసం చిత్రీకరణలో పాల్గొన్నాను. ఉదయం ప్యాక్ అప్ తర్వాత బయటకు వెళ్లాను. ఆ రాత్రి నదియోన్ పార్ చిత్రీకరణలో పాల్గొన్నాను. 7 గంటల్లో నిద్ర లేకుండా పాటను పూర్తి చేసి, ఆ రోజు గుడ్ లక్ జెర్రీని తిరిగి ప్రారంభించడానికి వెంటనే వచ్చాను. 3 రోజుల నిద్ర లేని మారథాన్. కెమెరా ముందు ఉండటానికి ఉత్సాహం మాత్రమే ఉంది. పాటలో తాను ధరించిన దుస్తులను కేవలం ఒక రోజులోనే తయారు చేశారని కూడా జాన్వి వెల్లడించింది.
జాన్వి ప్రధాన పాత్రలో నటించిన 'రూహీ'లో రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మ, అలెక్స్ ఓనెల్, మానవ్ విజ్, సరితా జోషి కూడా కీలక పాత్రల్లో నటించారు. తదుపరి జాన్వి 'పరమ్ సుందరి'లో, సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు, వరుణ్ ధావన్ సరసన 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి'లో కూడా నటించనుంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.