ప్రియుడితో జాన్వీ బికినీ బీచ్‌లో చిల్లింగ్
జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
By: Tupaki Desk | 20 Sep 2024 2:45 PM GMTజాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేవర పాన్ ఇండియాలో విడుదలవుతోంది కాబట్టి తన నటన గురించి ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది రెండుచోట్లా చర్చ జరగడం ఖాయం. బాలీవుడ్ లో ఎన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించినా కానీ, సౌత్ ఆరంగేట్రంలో జాన్వీకి అదిరిపోయే మాసీ విలేజీ అమ్మాయి పాత్ర దొరికిందని ఇప్పటికే విడుదలైన విజువల్స్ చెబుతున్నాయి. దేవర విజయం జాన్వీ కెరీర్ కి బిగ్ బూస్ట్ ని ఇస్తుందనడంలో సందేహం లేదు. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో అగ్ర హీరోల సరసన నటిస్తున్న జాన్వీ కపూర్ ఇతర తెలుగు హీరోలతోను నటించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు జాన్వీ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల ప్రధానంగా హెడ్ లైన్స్ లోకొస్తోంది.
యుక్తవయసులో ఉన్న జాన్వీ కపూర్ ఏనాడూ తన వ్యక్తిగత విషయాలను దాచిపెట్టలేదు. రాజకీయ వారసత్వం ఉన్న శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్న విషయాన్ని దాచలేదు. అతడితో నిరంతరం పబ్లిక్ ఔటింగులు, షికార్లు ఏదీ దాపరికం కాదు. జాన్వీ తండ్రి, నిర్మాత బోనీకపూర్ సైతం దీనికి అంగీకరించారు. సుశీల్ కుమార్ షిండే మనవడైన శిఖర్ తో ప్రతిసారీ తిరుమలేశుని సందర్శిస్తూ మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన జాన్వీ కపూర్ అతడితో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లోను ఫుల్ గా చిల్ చేస్తోంది.
తాజాగా అందుకు సంబంధించిన ఫోటోషూట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అయితే ఇది త్రోబ్యాక్ ఫోటో షూట్. అయినా మరోసారి అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియాతో బికినీ బీచ్ లో ఫుల్ చిల్లింగ్ గా కనిపించింది. బీచ్ లో బికినీ ధరించి టూ హా*గాను కనిపిస్తోంది. జాన్వీ కపూర్ ఈ త్రోబాక్ బీచ్ ఫోటోలలో అక్షరాలా జీవిస్తోంది! అంటూ ఒక అభిమాని దీనిపై కామెంట్ చేసాడు. ఈ అందమైన జంట స్నేహం, ప్రేమ ఎంతో అందంగా వికసిస్తోందని ఈ ఫోటోగ్రాఫ్ పై వ్యాఖ్యానిస్తున్నారు. మునుముందు టాలీవుడ్ సర్కిల్స్ లోను జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది మరి!!