అక్కా-చెల్లి ప్రియుడిపై ఇలా ఎక్కాసారేంటి?
ఇటీవల అంబానీ ఇంట పెళ్లి వేడుకలో జోడీ ఓ రేంజ్ లో హైలైట్ అయింది.
By: Tupaki Desk | 26 Sep 2024 11:28 AM GMTవేదాంగ్ రైనా- ఖుషీ కపూర్ లవ్ లో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. 'ది అర్చీస్' షూటింగ్ లో పెయిర్ గా నటించడమే కాదు..అప్పుడే ఒకర్ని ఒకరు అర్దం చేసుకుని రియల్ ఫెయిర్ అవ్వడానికి సిద్దమవుతున్నట్లు నాటి నుంచి బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అటుపై ఇద్దరు ఎన్నో ప్రయవేట్ పార్టీల్లో హల్చల్చేసారు. ఇటీవల అంబానీ ఇంట పెళ్లి వేడుకలో జోడీ ఓ రేంజ్ లో హైలైట్ అయింది.
అక్క జాన్వీ కపూర్ తో ...ఖుషీ వేదాంగ్ రైనాతో హాజరవ్వడంతో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. తాజాగా ప్రియుడు వేదాంగ్ నటించిన 'జిగ్రా' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఖుషీ కపూర్ ట్రైలర్ ని పొగిడేస్తూనే వేదాంగ్ పై మనసులో ప్రేమను చాటేస్తోంది. ఈ సందర్భంగా ఇన్ స్టా వేదికగా స్పందించింది. ట్రైలర్ షేర్ చేసి అమ్మడు హార్ట్ సింబల్, ఎమెనల్ ఫేస్ ఎమోజీలను పోస్ట్ చేసింది.
ఇది నెటి జనుల దృష్టిని ఆకర్షించింది. అతడి పై ఎంత ప్రేమ ఉందో హార్ట్ సింబల్ తో...సినిమాలో ఎమోషన్ ని కి అమ్మడు ఎంతగా కనెక్ట్ అయిందో చెప్పడానికి ఎమోషనల్ ఫేస్ఎమోజీలను పోస్ట్ చేసింది. అలాగే జాన్వీ కపూర్ కూడా దీనిపై స్పందించింది. వేదాంగ్ ట్రైలర్ లో నీ ప్రదర్శన చూసి నా హృదయం బరువెక్కింది. ట్రైలరే ఇలా ఉంటే సినిమాకి ఇంకే విధంగా ఫీలవుతానో అర్దం కావడం లేదు.
లేడీ బచ్చన్ అలియాభట్.. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఇది అద్భుతమైన సినిమా అవుతుందని ట్రైలర్ చెబుతుంది' అని రాసుకొచ్చింది. ఇలా అక్కా-చెల్లి పోస్ట్ తో 'జిగ్రా'కి మంచి ప్రచారం లభించింది. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే జాన్వీ నటించిన 'దేవర' మరి కొన్నిగంటల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.