Begin typing your search above and press return to search.

జాన్వీ క‌పూర్ వెనుక ఉంది డాడ్ కాదు ఆయ‌నా?

ఆ త‌ర్వాత బ్యాకెండ్ లో క‌ర‌ణ్ ప‌నిచేసినా? క్రెడిట్ అంతా బోనీ క‌పూర్ కే వెళ్లింది.

By:  Tupaki Desk   |   13 Sep 2024 12:08 PM GMT
జాన్వీ క‌పూర్ వెనుక ఉంది డాడ్ కాదు ఆయ‌నా?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ని వెంట ఉండి న‌డిపిస్తుంది డాడ్ బోనీ క‌పూర్ అంతా అనుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. డాడ్ సూచ‌న‌లు స‌ల‌హాల‌తోనే జాన్వీ కెరీర్ ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంద‌నుకున్నారంతా. ఆయ‌న కోర‌డంతోనే బాలీవుడ్ లో జాన్వీని క‌ర‌ణ్ జోహార్ `ధ‌డ‌క్` చిత్రంతో ప‌రిచ‌యం చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత బ్యాకెండ్ లో క‌ర‌ణ్ ప‌నిచేసినా? క్రెడిట్ అంతా బోనీ క‌పూర్ కే వెళ్లింది.

అమ్మ‌డి టాలీవుడ్ డెబ్యూ ప్లానింగ్ కూడా బోనీ క‌పూర్ దే అనుకున్నారంతా. ఆయ‌న ఒకే చెప్పిన త‌ర్వాత‌నే జాన్వీ `దేవ‌ర` సినిమాకి సైన్ చేసింద‌ని అంతా భావిస్తున్నారు. కానీ అస‌లు సంగ‌తేంటి? అంటే జాన్వీ కెరీర్ మొత్తాన్ని ప్లాన్ చేసింది క‌ర‌ణ్ జోహార్ అన్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. క‌ర‌ణ జోహార్ స‌లహాలు తీసుకుంటూనే జాన్వీ ముందు కెళ్తుందంటున్నారు.

బాలీవుడ్ లో తొలి అవకాశం అందుకున్న త‌ర్వాత కోలీవుడ్...టాలీవుడ్ లో అవ‌కాశాలు రాగా? ఎలా ముందుకెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో జాన్వీ నేరుగా క‌ర‌ణ్ స‌ల‌హా అడిగిందిట‌.ఆయ‌న వెంట‌నే ఏ హీరోతో అవ‌కాశం వ‌చ్చింద‌ని అడ‌గగా ఎన్టీఆర్ పేరు చెప్పిందిట‌. దీంతో క‌ర‌ణ్ జోహార్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఎస్ చెప్పు అని ముందుకు పంపించారుట‌.

క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌కుడే కాదు. బిజినెస్ వ్య‌వ‌హారాలు, సినిమా మార్కెట్ పై ఆయ‌న‌కు అపార అనుభ‌వం ఉంది. అందుకే జాన్వీ క‌ర‌ణ్ డైరెక్ష‌న్ లో ముందుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అనుకున్న‌ట్లే దేవ‌ర రిలీజ్ కి ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తోనూ ఛాన్స్ అందుకుంది. ఈ రెండు రిలీజ్ కాకుండానే కొత్త అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి.