Begin typing your search above and press return to search.

`పుష్ప‌-2` లో ఊపేసేది ఈవిడేనా?

`పుష్ప‌-2`లో ఐటం భామ ఎవ‌రు? అన్న దానిపై కొన్ని రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 May 2024 11:09 AM GMT
`పుష్ప‌-2` లో ఊపేసేది ఈవిడేనా?
X

`పుష్ప‌-2`లో ఐటం భామ ఎవ‌రు? అన్న దానిపై కొన్ని రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చాలా మంది స్టార హీరోయిన్ల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. స‌మంత త‌ప్ప అంద‌రి పేర్లు టాలీవుడ్ లో మీడియాలో వైర‌ల్ అయిన‌వే. వీళ్లు గాక న‌వ‌త‌రం భామ‌లు శ్రీలీల పేరు సైతం తెర‌పైకి వ‌చ్చింది. కానీ సుకుమార్ మాత్రం వాళ్లెవ‌రికీ ఓటు వేయ‌లేదు. ఆయ‌న మ‌న‌సులో ఉన్న హీరోయిన్ ఐటం భామ ఈవిడేనని తెలుస్తోంది.

దాదాపు ఆమె ఎంట్రీ ప్రాజెక్ట్ లో ఖ‌రారైన‌ట్లు క‌నిపిస్తుంది. ఆమె ఎవ‌రో కాదు అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌నయ జాన్వీ క‌పూర్ నే సుకుమార్ తీసుకున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. దీనికి సంబంధించి నేరుగా సుకుమార్ జాన్వీతో చ‌ర్చించడం..ఆమెని ఒప్పించ‌డం అన్నీ జ‌రిగిపోయాయి అట‌. ఆ మాస్ నెంబ‌ర్ ని జూన్ లో బ‌న్నీ-జాన్వీపై చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆపాట‌కి సంబంధించిన రిహార్స‌ల్స్ లోనూ జాన్వీ జాయిన్ అయింద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

ఈ పాట‌కు అమ్మ‌డు భారీగానే పారితోషికం తీసుకుంటుందిట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ అడ్వాన్స్ గా కొంత మొత్తం చెల్లించిన‌ట్లు స‌మాచారం. ఈ అవ‌కాశాన్ని జాన్వీ కూడా స‌రైన స‌మ‌యంలో స‌ద్వినియోగం చేసుకుంటుంది. ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం దేవ‌ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు న్నాయి. అక్టోబ‌ర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ అంత‌కంటే ముందే పాన్ ఇండియా మార్కెట్ త‌న హాట్ అప్పిరియ‌న్స్ తో `పుష్ప‌-2` ఐటం పాట‌తో షేక్ చేస్తుంది.

ఈ రెండింటి త‌ర్వాత ఆర్సీ 16తోనూ వ‌చ్చే ఏడాది అల‌రించ‌నుంది. ఇలా వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అయితే జాన్వీకి ఎన్నిర‌కాలుగా క‌లిసొస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. అక్క‌డ సినిమాల‌కంటే తెలుగు సినిమాల‌తోనే ఇండియాలో ఎక్కువ‌గా పాపుల‌ర్ అవ్వ‌డం ఖాయం.