Begin typing your search above and press return to search.

మ‌స‌క మ‌స‌క చీక‌టిలో మ‌ల్లె తోట వెన‌కాల..!

ఇంత‌లోనే ఇప్పుడు ఈ కొత్త లుక్ తో మ‌రోసారి స‌ర్ ప్రైజ్ చేసింది. తాజా ఫోటోషూట్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో జాన్వీ హీట్ పుట్టించింది. నేవీ బ్లూ క‌ల‌ర్ ఫ్రాకులో జాన్వీ ఎంతో హాట్ గాను క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:39 PM GMT
మ‌స‌క మ‌స‌క చీక‌టిలో మ‌ల్లె తోట వెన‌కాల..!
X

మ‌స‌క మ‌స‌క చీక‌టిలో మ‌ల్లె తోట వెన‌కాల.. నువ్ అడిగింది దొరుకుతుంది.. యా.. యా..! ఈ పాట‌లో మీనింగులా కుర్ర‌బ్యూటీ భంగిమ‌లు వీక్షించాక అంద‌రికీ పుట్టుకొచ్చే సందేహాలివి. బాలీవుడ్ టు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు మార్మోగుతోంది. లెజెండరీ నటి, దివంగత శ్రీదేవి కి, నిర్మాత బోనీ కపూర్ ల‌ కుమార్తె జాన్వీ చిత్ర పరిశ్రమలో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. తన అద్భుతమైన రూపంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పటివరకు లెక్కలేనన్ని ప్రశంసలను గెలుచుకున్న జాన్వీ త‌న‌ నటనా నైపుణ్యంతోను ప్రశంసలు అందుకుంది.


జాన్వీ కపూర్ గణేష్ చతుర్థి కోసం గోల్డెన్ చీరలో తన ఎథ్నిక్ తో క‌నిపించి ఆక‌ర్షించింది. ఇంత‌లోనే ఇప్పుడు ఈ కొత్త లుక్ తో మ‌రోసారి స‌ర్ ప్రైజ్ చేసింది. తాజా ఫోటోషూట్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో జాన్వీ హీట్ పుట్టించింది. నేవీ బ్లూ క‌ల‌ర్ ఫ్రాకులో జాన్వీ ఎంతో హాట్ గాను క‌నిపిస్తోంది.

ఇక జాన్వీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే చాలానే కొత్త సంగ‌తులు వున్నాయి. ఓవైపు వ‌రుస‌గా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే, ఇటీవ‌ల టాలీవుడ్ పైనా దృష్టి సారించింది. తెలుగులో ఆరంగేట్ర‌మే యంగ్ య‌మ ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ అరుదైన అవ‌కాశం అందుకుంది. తార‌క్ తో తొలి అవ‌కాశానికి జాన్వీ చాలా మురిసిపోయింది. న‌టిగా ఇప్ప‌టికే నిరూపించుకున్న ఈ బ్యూటీ తార‌క్ తో క‌లిసి ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు చేయాల్సి ఉంటుంది. ఇక జాన్వీ లుక్స్ అప్పియ‌రెన్స్ మాస్ కా రాణీ త‌ర‌హాలో ఉంటాయి. మునుముందు తెలుగు ఆడియెన్ కి ఇది స్పెష‌ల్ ట్రీట్ గా మార‌నుంద‌ని అంచ‌నా.