ఇటలీలో జాన్వి-పహారియా ఎంత క్లోజ్ గా అంటే?
జాన్వీకపూర్ -శిఖర్ పహారియా మధ్య ప్రేమాయణం పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 3 Jun 2024 1:44 PM GMTజాన్వీకపూర్ -శిఖర్ పహారియా మధ్య ప్రేమాయణం పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివ రకూ వ్యవహారం కేవలం నెమ్మదిగా నడుస్తున్నట్లే అనిపించింది. కానీ ప్రేమాయణాన్ని చాలా కాలంగానే పరుగులు పెట్టిస్తున్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ జంట ఎంతో క్లోజ్ గా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇటలీలో జాన్వీకపూర్ -శిఖర్ పహారియా ఏదో ఈవెంట కి హాజరైనట్లు కనిపిస్తుంది.
ఆ ఈవెంట్ లో భారీ ఎత్తున జనం గుమిగూడి ఉన్నారు. జనమంతా ఆ వెంట్ వైపు చూస్తున్నారు. మరికొంత మంది రోడ్డు మీద నడుచుకుంటు వెళ్తున్నారు. కానీ జాన్వీ-పహారియా ఏం చేస్తున్నారో తెలుసా? అదే జనంలో జాన్వీకపూర్- శిఖర్ పహారియా పక్క పక్కనే నుంచున్నారు. జాన్వీ చేతిలో ప్లేట్ అందులో ఆహారం ఉంది. ఆ ఫుడ్ ని ప్రియుడికి ఎంతో ఇష్టంగా తినిపిస్తుంది. తాను ఓ స్పూన్ తీసుకుంటూ..ప్రియుడికి ఓ స్పూన్ నోట్లో పెడుతూ ఇటలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
వాళ్లద్దరి కామన్ ప్రెండ్ మరోకరు కనిపిస్తున్నారు. అతని కారణంగా శిఖర్ పహారియా కాస్త హైడ్ అయినట్లు ఉంది . ఈ వీడియో చాలా పాతది. కానీ నెట్టింట ఇప్పుడు నెట్టింట లీక్ అవ్వడంతో వైరల్ గా మారింది. జాన్వీ-శిఖర్ మధ్య ప్రేమాయణం సాగుతుందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతుంది. అందుకు తగ్గట్టు ఇద్దరు కెమెరాకి చిక్కిన సందర్భాలెన్నో. కరణ్ జోహార్ టాక్ షోలో సైతం ఇద్దరి మధ్య బాండింగ్ గురించి చెప్పే ప్రయత్నం చేసింది.
ఇదంతా అందరికీ తెలిసిన సమాచారం. కానీ ఆ వీడియో చూస్తుంటే? వాళ్లిద్దరు ఇప్పటి నుంచి కాదు చాలా కాలంగా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ హిదీ సినిమాల్ని పక్కనబెట్టి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. మూడవ సినిమా ఛాన్స్ కూడా తనదేనని టాలీవుడ్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.