Begin typing your search above and press return to search.

జాన్వీ జోకులు అంత‌గా పేల‌లేదు కానీ!

వ‌రుస‌గా టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేస్తూ జాన్వీ తెలుగులో స్టార్ స్టాట‌స్ అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 3:42 AM GMT
జాన్వీ జోకులు అంత‌గా పేల‌లేదు కానీ!
X

వ‌రుస‌గా టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేస్తూ జాన్వీ తెలుగులో స్టార్ స్టాట‌స్ అందుకుంటోంది. ఎన్టీఆర్ దేవ‌ర త‌ర్వాత చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాలో న‌టించేస్తోంది. త‌దుప‌రి మ‌హేష్‌, అల్లు అర్జున్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించేందుకు బిగ్ స్కెచ్ వేస్తోంద‌ట‌. పుష్ప‌-2లో జాన్వీ ఐట‌మ్ నంబ‌ర్ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

మ‌రోవైపు జాన్వి కపూర్ త‌న సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ కి అద్భుత‌మైన ట్రీటిస్తూ ఫాలోయింగ్ ని అంతంకంత‌కు పెంచుకుంటోంది. తాజాగా జాన్వీ స్టాండ‌ప్ కామెడీని ప్ర‌య‌త్నించిన ఒక వీడియో రెడ్డిట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జాన్వి నో-మేకప్ లుక్స్ వంటి పనికిరాని చిట్కాలకు బదులుగా జీవితాన్ని మార్చే సమాచారాన్ని అందించాల‌ని అభ్యర్థించింది. అంతేకాదు.. డేటింగ్ గురించి చాలా ఫ‌న్నీగా చ‌ర్చకు తెర‌లేపింది. డేట్ తర్వాత అసురక్షిత సాన్నిహిత్యం ద్వారా HPV వైర‌స్ వ్యాప్తి గురించి హెచ్చరించిన తీరు న‌వ్విస్తుంది.

దయచేసి ప్రేమను ప్రేమించండి.. ఎర్ర జెండా గురించి నాకు చెప్పవద్దు. రెడ్ క్రాస్ గురించి చెప్పు. HPV అనేది వైరస్... అంటూ గ‌ల‌గ‌లా మాట్లాడేసింది జాన్వీ. అయితే జాన్వీ గ‌ల‌గ‌లా మాట్లాడేసినా కానీ ఈ స్కిట్ త‌మ‌ను న‌వ్వించ‌లేద‌ని రెడ్డిట్ యూజ‌ర్స్ కొంత నిరాశ‌ప‌డ్డారు. బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇటీవల రెడ్డిట్లో `ఆస్క్ మి ఎనీ (AMA) సెషన్‌`ను నిర్వహించారు. ఇందులో జాన్వీని చిరాకు పెట్టే కొన్ని ప్ర‌శ్న‌ల‌కు కూడా కొంద‌రు అడిగారు. అయితే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తో వైర‌స్ వ్యాపిస్తుంద‌ని జాన్వీ ఫ‌న్ ని క్రియేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది. అది అభిమానుల‌ను న‌వ్వించింది.

జాన్వి న‌టించిన చిత్రం `మిస్టర్ & మిసెస్ మాహి` ఇటీవ‌లే విడుద‌లై మిశ్ర‌మ స‌మీక్ష‌ల‌ను అందుకుంది. షరన్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు- జాన్వి కపూర్ నటించారు. సోహా అలీ ఖాన్, కునాల్ ఖేము, అంగద్ బేడి, నేహా ధూపియా త‌దిత‌రులు ఈ సినిమాని స‌మీక్షించారు.

https://www.reddit.com/r/BollyBlindsNGossip/comments/1d4kysq/please_welcome_jahnvi_the_standup_comedian_this/?utm_source=embedv2&utm_medium=post_embed&utm_content=whitespace&embed_host_url=https://www.news18.com/movies/janhvi-kapoor-opens-up-on-intimacy-after-a-date-video-goes-viral-skin-to-skin-contact-watch-8911086.html