Begin typing your search above and press return to search.

జాన్వీ అవ‌కాశం కోసం యాచించ‌ని ఒకే ఒక్క‌డు!

ఆ పాత్ర‌కి సెట్ అవుతార‌నుకుంటే? కాల్ చేసి ఆడిష‌న్కి పిల‌వ‌డం వంటివి జ‌రుగుతుటాయి.

By:  Tupaki Desk   |   27 July 2024 5:30 PM GMT
జాన్వీ అవ‌కాశం కోసం యాచించ‌ని ఒకే ఒక్క‌డు!
X

అడిగితేగానీ అమ్మైనా పెట్ట‌దంటారు. అలాంటింది ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుందో తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అది కొంత‌వ‌ర‌కే పరిమితం. ఆత‌ర్వాత ట్యాలెంట్ తోనే పైకి రావాలి. అవ‌కాశాలు అందుకోగ‌ల‌గాలి. ఈ క్ర‌మంలో ర‌క‌ర‌కాల ద‌ర్శ‌క‌, నిర్మాతల్ని, యాడ్ ఏజ‌న్సీల‌ను క‌ల‌వ‌డం అవ‌కాశాలు అడ‌గ‌డం జ‌రుతుంది. ఆ పాత్ర‌కి సెట్ అవుతార‌నుకుంటే? కాల్ చేసి ఆడిష‌న్కి పిల‌వ‌డం వంటివి జ‌రుగుతుటాయి.

స్టార్ డ‌మ్ వ‌చ్చే వ‌ర‌కూ ఏ న‌టి అయినా ఇది చేయ‌క త‌ప్ప‌దు. స్టార్ కిడ్స్ కి సైతం ఇలాంటివి త‌ప్ప‌వు. ఇక జాన్వీ క‌పూర్ బాలీవుడ్ కి స్టార్ కిడ్ గా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. మామ్ శ్రీదేవి ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయన్..డాడ్ బోనీ క‌పూర్ పెద్ద నిర్మాత‌. అందుకే క‌ర‌ణ్ జోహార్ ...జాన్వీని లాంచ్ చేసే బాద్య‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. `ధ‌డ‌క్` సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే లాంచ్ అయింది.

అటుపై ఇత‌ర బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు అందుకుంటుంటుంది. ఒక‌వేళ అవ‌కాశాలు రాక‌పోతే స్వ‌యంగా మీరు ఏ నిర్మాత‌నైనా అవ‌కాశాలు అడుగుతారా? అంటే జాన్వీ అడుగుతానని చెప్పింది. త‌న‌కు తెలిసిన ప్ర‌తీ నిర్మాత‌ను అవ‌కాశం అడుగుతానంది. ఒక‌వేళ ప‌రిచ‌యం లేక‌పోయినా వాళ్ల‌ద‌గ్గ‌ర‌కు వెళ్లి నిర్మొహ మాటంగా అడుగుతానంది. అయితే అప్ప‌టికి తానేంటో ప్రూవ్ చేసుకున్న త‌ర్వాత అలాంటి వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్తానంది.

అంత‌వ‌ర‌కూ తెలియ‌ని వారిని అవ‌కాశాలు అడ‌గ‌నుంది. ముఖ్యంగా డాడ్ బోనీ క‌పూర్ ని అయితే అస్సలు అడ‌గ‌నంది. ఎందుకంటే నాన్న‌నే అవ‌కాశం ఇవ్వండి అని అడ‌గ‌డం త‌న‌కెంత మాత్రం ఇష్టం లేదుట‌. డాడ్ విష‌యంలో ఆయ‌నే జాన్వీ ట్యాలెంట్ గుర్తించి పిలిచి అవ‌కాశం ఇచ్చేంత‌వ‌ర‌కూ సొంత బ్యాన‌ర్లో సినిమా చేయ‌ను అంటోంది. సొంత బ్యాన‌ర్లో నాన్నని అడిగితే వెంట‌నే సినిమా చేస్తారు. కానీ అలా అడిగి సినిమా చేయ‌డం ఇష్టం లేదంది. మొత్తానికి అమ్మ‌డు సొంత బ్యాన‌ర్ విష‌యంలో మంచి కండీష‌న్ పెట్టుకునే ముందుకెళ్తుంది.