Begin typing your search above and press return to search.

ఎక్స్ ఫోటోల‌పై జాన్వీ క‌పూర్ ఏమందంటే?

తాజాగా అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ కూడా అలాంటి వాటిని ఎదుర్కోక త‌ప్ప‌లేదు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 8:30 AM GMT
ఎక్స్  ఫోటోల‌పై జాన్వీ క‌పూర్ ఏమందంటే?
X

సెల‌బ్రిటీల పేరుతో సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారాలెన్నో. అందులోనూ హీరోయిన్ల గురించైతే పీక్స్ లో ప్ర‌చారం జ‌రుగుతుంటుంది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల ద్వారా ఫేక్ ఫోటోల‌తో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జరుగుతుంటాయి. తాజాగా అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ కూడా అలాంటి వాటిని ఎదుర్కోక త‌ప్ప‌లేదు. జాన్వీ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

సినిమా వివేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎన్నో పంచుకుంటుంది. తనకు సంబంధించిన రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. జాన్వీ క‌పూర్ పేరుతో తన ఎక్స్ ఖాతాలో కొన్ని అశ్లీల చిత్రాలు పోస్ట్ అయ్యాయి. అవి నెట్టింట అంతే వైర‌ల్ అయ్యాయి. వాటిని చూసి అభిమానులు ఇవేం ఫోటోలంటూ షాక్ అయ్యారు. అయితే ఈ విష‌యాన్ని జాన్వీటీమ్ వెంట‌నే ప‌సిగ‌ట్టింది.

తాజాగా ఆ ఫోటోలపై క్లారిటీ ఇచ్చింది. అస‌లు ఆ ఎక్స్ ఖాతా జాన్వీదే కాద‌ని ఖండించింది. `ద‌య‌చేసి ఇలాంటి ఫేక్ అకౌంట్ల‌ను ఫాలో అవ్వ‌కండి. వీటిలో పోస్ట్ చేసే స‌మాచారాన్ని న‌మ్మోదు` అని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో ఉండే నకిలీ ఖాతాల పట్ల అభిమానులంతా అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్‌ ప్రతినిధి సూచించారు. అలాంటివి ఏవైన నెట్టింట క‌నిపిస్తే వెంట‌నే త‌న టీమ్ ని సంప్ర‌దించి క్లారిటీ తీసుకోవాల్సిందిగా కోరారు. దీంతో జాన్వీ క‌పూర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం జాన్వీ క‌పూర్ వ‌రుస షూటింగ్ ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సర‌స‌న `దేవ‌ర‌`లో న‌టిస్తుంది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో మ‌రో సినిమా చేస్తుంది. ఈ రెండు గాక మ‌రిన్ని తెలుగు ఆఫ‌ర్లు అమ్మ‌డి ముందు క్యూ క‌డుతున్నాయి. కానీ సొగ‌స‌రి హీరోల ఇమేజ్ని బేస్ చేసుకుని క‌మిట్ అవుతుంది. అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది.