వివాదంపై ఎన్టీఆర్ హీరోయిన్ సూపర్ రిప్లై
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది
By: Tupaki Desk | 27 July 2023 11:11 AM GMTఈ మధ్య కాలంలో సినిమాలు.. సిరీస్ ల్లో ఏదో ఒక పాయింట్ ను తీసుకుని వివాదం చేయడం పరిపాటి అయింది. కొన్ని వివాదాల వల్ల సినిమాకు అదనపు ప్రమోషన్ దక్కుతుంటే కొన్ని సినిమాలు మాత్రం నష్టపోతున్నాయి. తాజాగా వరుణ్ దావన్, జాన్వీ కపూర్ నటించిన 'బవాల్' చిత్రం ఓటీటీ ద్వారా డైరెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ఈ సినిమా వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కొందరు ఆందోళన మొదలు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాలో చూపడంతో పాటు నాజీలు.. యూదులకు సంబంధించిన విషయాలను టచ్ చేయడం జరిగింది.
రెండో ప్రపంచ యుద్ద సమయంలో నాజీలు నిర్భంద క్యాంపులను ఆష్విట్జ్ అంటారు. ఆ ఆష్విట్జ్ ల్లో యూదులను అత్యంత దారుణంగా హింసించడంతో పాటు పెద్ద ఎత్తున చంపేయడం జరిగిందని సినిమాలో పేర్కొన్నారు. చరిత్రలో కూడా అదే ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నాటి పరిస్థితులను చూపిస్తూ బవాల్ సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.
బవాల్ సినిమాపై కొందరు చేస్తున్న విమర్శలపై హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ స్పందించింది. ఆమె వివాదంపై స్పందిస్తూ... నాజీల నిర్బంధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నాకు తెలిసిన ఒక ఇజ్రాయెల్ వ్యక్తి అతడి పూర్వీకుల గురించి నాతో మాట్లాడాడు. బవాల్ సినిమా ను చూసిన తర్వాత అతడు భావోద్వేగానికి గురి అయినట్లుగా చెప్పుకొచ్చాడు.
సినిమాను చూసిన తర్వాత ఆయన అర్థం చేసుకుని మమ్ములను అభినందించాడు. సినిమాను బాగా తీశారని అన్నాడు. అంతే తప్ప తన మనోభావాలు దెబ్బ తిన్నాయని అనడం కానీ.. తాను ఆవేదన చెందినట్లుగా కానీ ఆయన చెప్పలేదు. అసలు ఆయన కు సినిమా గురించి ఎలాంటి ఫిర్యాదు కూడా లేదు అని చెప్పాడు.
సినిమా ను చూసే దృష్టిని బట్టి వివాదం మొదలు అవుతుంది. అంతే తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదు. అసలు ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం మా ఉద్దేశ్యం కాదు అన్నట్లుగా జాన్వీ కపూర్ పేర్కొంది. ఈ సినిమాలో నా పాత్ర ను చూసి చాలా మంది అమ్మాయిలు, విద్యార్థులు చలించి పోయి ముందుకు వచ్చి తమ ఇబ్బందులను చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని జాన్వీ చెప్పుకొచ్చింది.